అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్ లను నిరాకరించింది. ఈ విషయం మీద భారత్ మండిపడుతోంది. By Manogna alamuru 22 Sep 2023 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి చైనాలో హంగజౌ లో 19వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారుల పట్ల చైనా వివక్ష చూపించింది. వారి వీసాలను, అక్రిడేషన్ ను నిరాకరించింది. దీని భారత్ స్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేలా చైనా ఉద్దేశపూర్వకంగానే ఈపని చేసిందని నిరసన తెలియజేసింది. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్ లో అంతర్భాగమేనని...భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇలా అడ్డుకోవడం క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి ప్రకటించింది. ఇటీవల జరిగిన జీ20 సమావేశాలకు ముందు స్టాండర్డ్ మ్యాప్స్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్, లద్దాక్ ప్రాంతాలను తమ మ్యాపులో కలిపేసుకుని చూపించింది. ఇది రెండు దేశాల మధ్య వివాదాలకు దారి తీసింది. చైనా ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ ని టిబెట్ లో భాగమని వాదిస్తోంది. దానిని భారత్ కూడా ధీటుగా అడ్డుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఫైట్ చేస్తోంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులను అడ్డుకున్న విషయంలో చైనా కూడా స్పందించింది. చట్టబద్ధంగా ఆసియా గేమ్స్ లో చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగతిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినధి మావోనింగ్ అన్నారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ ను మాత్రం చైనా ప్రభుత్వం గుర్తించలేదని చెప్పుకొచ్చారు. నైరుతి చైనా అయిన జిజాంగ్ అటానమస్ రీజియన్ దక్షిణ భాగం జాంగ్నాన్ చైనా భూభాగంలో అంతర్భాగమని మావోనింగ్ వ్యాఖ్యానించారు. #china #india #sports #visa #arunachal-paradesh #players #asia-games #denied మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి