Revanth -Chandrababu: ఇవాళ హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు.ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు.

New Update
Revanth -Chandrababu: ఇవాళ హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

Hyderabad: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు అనుకున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా, లేఖల ద్వారా వివరించారు.

తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం.

దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చర్చించనున్నారు.

మరోవైపు మైనింగ్‌ కార్పొరేషన్‌ సంబంధిత నిధుల పంపిణీ విషయంలో కూడా ఈ మధ్యనే క్లారిటీ వచ్చింది. విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే 30 సార్లు సమావేశం అయ్యారు. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 90 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది.ఈ క్రమంలోనే ఈ సమస్యలన్నింటీపై ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ జరుగనుంది

Also read: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క

Advertisment
Advertisment
తాజా కథనాలు