Chhattisgarh : కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 9 మంది మావోయిస్టులు మృతి! ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీస్ బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. By Nikhil 03 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Maoists : దండకారణ్యం వరుస కాల్పులతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీస్ బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దంతెవాడ-బీజాపూర్ జిల్లాల (Dantewada - Bijapur) సరిహద్దు భైరంగాడ్ ఠాణా పరిధిలోని అటవీప్రాంతం లో ఈ ఎదురుకాల్పులు (Encounter) జరిగినట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డట్లు సమాచారం. వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గడ్ దండకారణ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎదురుకాల్పుల్లో ఇటీవల భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరికొందరు మావోయిస్టులు లొంగిపోతున్నారు. Also Read : ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! #chhattisgarh #encounter #maoists #dantewada-bijapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి