World War-3: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..

భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరగడంపై చాట్‌ జీపీటీని అడిగిన ప్రశ్నకు అది ఆసక్తికమైన సమాధానం ఇచ్చింది. కొరియా ద్వీపకల్పం, మిడిల్ ఈస్ట్, తైవాన్ జలసంధి, తూర్పు ఐరోపా, దక్షిణ చైనా సముద్రం, భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని చెప్పింది.

New Update
World War-3: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..

రెండుసార్లు ప్రపంచ యుద్ధ జరిగిన సంగతి అందిరికి తెలిసిందే. మూడో ప్రపంచ యుద్ధం భవిష్యత్తులో జరగదా అంటే చెప్పలేం. రాబోయే రోజుల్లో ఏదైనా జరగొచ్చు. రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని.. పలు దేశాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. మళ్లీ ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరగడం, అలాగే ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై దాడులు చేయడం మరోసారి కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితమే కొద్దిరోజుల క్రితమే బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ సాండర్స్, నాటో జనరల్‌లు పౌరులను యుద్ధానికి రెడీగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి దేశం ‘పౌర సైన్యం’ లాగా ట్రైనింగ్ తీసుకోవాలని.. యుద్ధం అంటూ ప్రారంభమైతే, రిజర్వ్ దళాల సామర్థ్యం సరిపొదని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు పలు దేశాలు అనుకుంటున్నాయి. తాజాగా 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు ఏంటో చెప్పాలని ప్రముఖ ఏఐ సంస్థ అయిన చాట్‌ జీపీటీ అడగగా ఇది ఆరు ప్రదేశాలను బయటపెట్టింది. ఈ ఆరు ప్రదేశాల్లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నట్లు చాట్‌ జీపీటీ చెప్పింది.

1. కొరియా ద్వీపకల్పం
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో అమెరికా ప్రమేయం ఉండటంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఉ.కొరియా తరచుగా కొత్త క్షిపణులను టెస్ట్ చేస్తోంది. దీనికి చైనాతో పాటు పలు దేశాల నుంచి మద్దతు వస్తోంది. ఇక్కడ నుంచి 3వ ప్రపంచ యుద్ధం మొదలుకావచ్చు.

2. మిడిల్ ఈస్ట్
మిడిల్‌ ఈస్ట్‌లో కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం కొలిక్కి రాలేదు. ఈ సమయంలోనో ఇరాన్‌తో సహా.. పొరుగు దేశాల ప్రమేయం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచేశాయి. అలాగే సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడైనా యుద్ధానికి దారితీయవచ్చు.

3. తైవాన్ జలసంధి
చైనా, తైవాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఆసియా - పసిఫిక్‌కు చెందిన ఈ ప్రాంతంలో ఎప్పుడైనా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావొచ్చు.

4. తూర్పు ఐరోపా
రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల వల్ల తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతోంది. ఇది ఎప్పుడైనా తీవ్రమైన దాడులకు దారి తీయొచ్చు.

5. దక్షిణ చైనా సముద్రం
దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తారా స్థాయికి చేరుకోవచ్చు. దీనినుంచి 3వ ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది.

6. భారత్‌-పాక్‌ సరిహద్దు
భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సరిహద్దుల్లో తరచుగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఇరుదేశాల మధ్య రెండుసార్లు యుద్ధం సంభవించింది. అయితే ఇది ఇతర దేశాలను కూడా ప్రభావితం చేయగలదు. గత నాలుగు సరిహద్దులో శాంతియుత వాతావరణ ఉన్నప్పటికీ.. భారత్, పాక్‌లకు అణు సామర్థ్యం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్‌ జీపీటీ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు