KCR: కేసీఆర్‌కు షాక్.. కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు

విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కమిషన్ ఛైర్మన్ నర్సింహరెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

New Update
KCR: కేసీఆర్‌కు షాక్.. కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ కమిషన్ ఛైర్మన్ నర్సింహరెడ్డి స్థానంలో కొత్తవారిని నియమించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. కమిషన్‌ను రద్దు చేయాలని కోరే అర్హత కేసీఆర్‌కు లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

Also read: అంగన్‌వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌..!

మరోవైపు విద్యుత్ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ నర్సింహ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాసి లెటర్‌ను విచారణ జరిగేటప్పుడు సుప్రీంకోర్టుకు న్యాయవాదులు అందజేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కోర్టు సమయమిచ్చింది. అయితే సోమవారం లోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్త ఛైర్మన్‌గా ఈసారి ఎవరిని నియమిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read:  ఫ్రీ బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ని అమలు చేయండి: కేటీఆర్‌ !

Advertisment
Advertisment
తాజా కథనాలు