Chandrababu:చంద్రబాబును కలిసి కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు. 14 గంటలు ప్రయాణం చేసి ఈరోజు ఉదయం 6గంటలకు ఉండవల్లిలో ఆయన నివాసానికి వచ్చారు. చంద్రబాబును ఇంటిలో కలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు.

New Update
Chandrababu:చంద్రబాబును కలిసి కన్నీరు పెట్టుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు

నిన్న జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు సాయంత్రం 4.15 గంటలకు రాజమండ్రి నుంచి బయలు దేరారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలో తన నివాసానికి వచ్చారు. రాజమండ్రికి చేరుకున్న భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి రోడ్డు మార్గంలో 14 గంటలు ప్రయాణం చేసి ఈ రోజు ఉదయం ఆరు గంటలకు నివాసానికి చేరుకున్నారు బాబు.

Also read:ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో!

దారి పొడవునా చంద్రబాబు నాయుడును చూడ్డానికి ప్రజలు వస్తూనే ఉన్నారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం పెద్ద సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

publive-image

ఇంటికి వచ్చిన వెంటనే చంద్రబాబు మొట్టమొదటగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఆ తర్వాత పూజారులు, పండితులు బాబు దంపతులను ఆశీర్వదించారు.

publive-image

టీడీపీ అధినేత చంద్రబాబు రాకకు ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు.

publive-image

రెండు నెలలు జైల్లో గడిపి వచ్చిన బాబును చూసి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది కన్నీరు పెట్టుకుని మరీ తమ అభిమాన్నాన్ని, ప్రేమను చూపించారు.

publive-image

చంద్రబాబు ప్రతీ ఒక్కరినీ దగ్గర తీసుకుని మరీ పలకరించారు. అయితే సుదీర్ఘ ప్రయాణం వలన బాబు బాగా అలిసి పోయారని చెబుతున్నారు కుటుంబసభ్యులు, బంధువులు.

babu house

ఈరోజు కొంతసేపు కుటుంబసభ్యులు, బంధువులతో గడిపిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళనున్నారు. అక్కడ ఆయన ఎప్పుడూ వెళ్ళే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు