Telangana Elections: చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్‌కు నష్టమా?

చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్‌ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పూర్తి కథనం కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..

New Update
Telangana Elections: చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్‌కు నష్టమా?

TDP vs BRS in Telangana: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై నేటికి 37 రోజులు అవుతోంది. ఇప్పటికీ ఆయన కేసులో ఎలాంటి పురోగతి లేదు. కిందిస్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతి పిటిషన్‌పై విచారణ వాయిదాల పర్వం కొనసాగుతోంది. వెరసి చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో వైసీపీపై మాత్రమే కాకుండా.. తెలంగాణలో బీఆర్‌ఎస్ పైనా పడనుందా? చంద్రబాబు అరెస్ట్.. కేసీఆర్ కు నష్టం చేకూరుస్తుందా? దీనంతటికీ కారణం మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలేనా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

గడిచి రెండు ఎన్నికల వకు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్న ఏపీ సెటిలర్లు.. ఈసారి మాత్రం ఆపార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలస్తోంది. ఇందుకు కారణం.. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్సే. అవును, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లో ఉన్న కొందరు నేతలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసరాల్లో ఆందోళనకు దిగారు. అయితే, ఈ ఆందోళనలను మంత్రి కేటీఆర్ ఖండించారు. చంద్రబాబు అక్కడ అరెస్టైతే.. ఇక్కడ ధర్నాలేంటి? ఇక్కడ ధర్నాలు చేయడానికి అనుమతి లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక వీరి ధర్నాపై పోలీసులు కన్నెర్ర చేశారు. దొరికిన వారిని దొరికినట్లే.. అరెస్ట్ చేసి తరలించారు. మొన్నటికి మొన్న కొందరు టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. మెట్రోలో ఎక్కి నిరసన చేపట్టగా.. ఆ వ్యవహారంపైనా మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి ధర్నాలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ధర్నా చేసుకోవాలంటే.. ధర్నా చౌక్‌కి వెళ్లి చేసుకోవాలని సూచించారు.

ఇంత వరకు బాగానే.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని సెటిలర్లు మండి పడుతున్నారు. తమ అభిమాన నాయకుడు అరెస్టైతే.. ఆందోళన చేపట్టే అర్హత లేదా? అని మండిపడుతున్నారు. తమను తక్కువ చేసి చూస్తున్న కేటీఆర్‌కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ మద్ధతుదారులు చాలా మందే ఉన్నారు. ఎమ్మె్ల్యే విజయాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. కూకట్‌పల్లి, మాదాపూర్, మల్కాజిగిరి వంటి కొన్ని స్థానాలో విజయాన్ని నిర్దేశించే స్థాయిలో సెటిలర్లు ఉన్నారు. తాజా పరిణామాలతో వీరంతా కాంగ్రెస్‌ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో చూడాలి.

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు