Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నారు. సైకో జగన్ కు ముద్దులు, గుద్దులు, రద్దులు తప్పా ఇంకేం తెలియదని, వైసీపీని అన్నదాతలు, ఉద్యోగులు తరిమికొడతారన్నారు.

New Update
Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు

Chendrababu: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ )YCP), (TDP) టీడీపీ నేతలు పోటాపోటిగా ప్రచారం చేస్తూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసకుంటున్నారు. విశాఖ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ (CM JAGAN) తీవ్ర విమర్శలు చేయగా.. ఈ రోజు పత్తికొండలో 'రా కదలిరా' ప్రోగ్రాంలో జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నా.

ప్రజలు ఫినిష్ చేస్తారు..
ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. పత్తికొండ సభ జన సముద్రంలా మారిందన్నారు. ఇది మామూలు మీటింగ్ కాదని సభకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజల గోడు కనిపిస్తోంది. యువతకు ఉద్యోగం లేక బాధ పడుతున్నారు. అందుకే వచ్చాను. మీకు భరోసా ఇచ్చేందుకు వచ్చాను. కర్నూలు పార్లమెంటును మార్చేందుకు వచ్చాను. మళ్ళీ పాత పార్లమెంటుగా మార్చే బాధ్యత నాదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజలు ఫినిష్ చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు.

అబద్ధాలు చెప్పడంలో దిట్ట..
అలాగే జగన్ ను ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని, జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అన్నారు. జగన్ ఓ విచిత్రమైన వ్యక్తి. మానసిక రోగి. సైకో. జగన్ ఓ క్యాన్సర్ గడ్డ. బీసీలకు న్యాయం చేయలేని జగన్ ఓ సైకో ముఖ్యమంత్రి. నా బీసీలు, నా ఎస్సీలు అంటూ మీ ముందుకు వస్తాడని ఎద్దేవా చేశాడు. ఇక ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తా. ఈ ప్రాంత అభివృద్ది కోసం పాటు పడే వ్యక్తి కెయి కృష్ణ మూర్తి. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. టీడీపీయే వైసీపీలో అధిక దాడులు బీసీలపైనే జరిగాయని, ఏనాడు కూడా ఒక్క బీసీని పరామర్శించిన దాఖలు లేవన్నారు. కోడి కత్తి కేసులో ఒకరు జైలు మగ్గుతుంటే, బాబాయ్ హత్య కేసులో ఆ వ్యక్తి బయట తిరుగుతూనే ఉన్నారని విమర్శించారు.

జాబు రావాలంటే బాబు రావాలి..
వైజాగ్ లో జగన్ సిద్దం అంటూ సభ పెడితే.. జగన్ ను ఓడించెందకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి. అధికారంలోకి రాగానే మానిఫెస్ట్ లో ఇచ్చిన విధంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. యువతను అదుకుందాం. వచ్చేది టిడిపి జన సేన అధికారంలోకి వస్తాం. 73 రోజులు ఓపిక పట్టండి. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మొన్న 4 కోట్లతో ఇంటర్వ్యూలు పెట్టి చివరి క్షణంలో క్వశ్చన్ పేపర్ మారిందని జవాబులు చెప్పలేక పోయాడు ఈ మొద్ధబ్బయ్ అంటూ ఎగతాళి చేశాడు.

బిల్డప్ ఎక్కువ..
సాక్షి పేపర్ కు అనేక ప్రకటనలు ఇచ్చి ముస్లిం మైనార్టీలకు మాత్రం ఏమి చేయలేక పోతున్నాడన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం చనిపోతే ఇప్పటి వరకు కూడా పరామర్శించలేదని,
వై నాట్ 175 అంటూ చెబుతున్న జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ముందు పులివెందులలో గెలిచి చూడు.. తరవాత చూద్దామన్నారు. 68 మంది అభ్యర్థులు మార్చాడని, 29 మందికి సీట్లు లేవన్నాడని, అందులో ఎక్కువ ఉన్నవారు ఎస్సీ, ఎస్టీలు, బీసీలేనన్నారు. దోపిడీ, దౌర్జన్యాలు చేసిన వారిని మాత్రం మార్చడం లేదని, మరికొందరికి బదిలీలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇదేనా మీ పార్టీ ఉద్దేశ్యం. ఎమ్మెల్యేలను కాదు మర్చాల్సింది. నిన్ను మార్చాలి. కర్నూలు జిల్లాలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేశారా? ఒక సంక్షేమ పథకాలను అమలు చేసమంటున్న వైసీపీ వారికి చెబుతున్నా.. టీడీపీలో పెట్టిన వాటిని రద్దు చేసాడు. ఈ ఐదేళ్ళలో ఎన్నో అక్రమ కేసులు పెట్టాడు. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది అని బాబు అన్నారు.

ఇది కూడా చదవండి : Rohan: ఆమె మెసేజ్‌ నా జీవితాన్ని మార్చేసింది.. టెన్నిస్ స్టార్‌ బోపన్న

ఊరు వాడా సిద్దం..
జగన్ ను ఓడించేందుకు ఊరు వాడా సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ వారిని తరమి కొట్టేందుకు అన్నదాతలు సిద్దంగా ఉన్నారు. అహంకారం ను అణచి వేసేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారు. ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఈ సైకో ముఖ్యమంత్రి కి తెలిసిందే ఒక్కతే ముద్దులు, గుద్దులు, రద్దులు, కుల్చూడు తప్ప ఏదీ లేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది చేసే బాధ్యత టీడీపీ, జనసేన బాధ్యత అని మాటిచ్చారు. ఈ ప్రాంతాన్ని సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ తో అభివృద్ది చేస్తానని. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తానని హామీ ఇస్తున్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచిందని విమర్శించారు.

నకిలీ బ్రాండ్ జగన్..
ఇక మద్యపాన నిషేదం అంటూ ఏమైనా చేశాడా? అని ప్రశ్నించిన బాబు.. నకిలీ బ్రాండ్, జగన్ బ్రాండ్ ను తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసుకున్నాడన్నారు. మీ రక్తాన్ని తాగే జలగ జగన్. ఇలాంటి సిఎం కు ఓట్లు అడిగే హక్కు లేదు. మీ ఊర్లో ఇసుక ఉంటే టీడీపీ హయాంలో ఫ్రీగా ఇచ్చాం. కానీ ఇపుడు ఎమ్మెల్యేలు ఇసుక దోపిడి దారులుగా మారారు. దోపిడీ చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అనేక పన్నులు వేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు.

రాయలసీమ రతనాల సీమ..
తాము అధికారంలో ఉన్నప్పుడు గుందేవులు, LLC , వేదవతి అనేక ప్రాజెక్టులకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. ఇవి బాగుంటే రైతులు బంగారాన్ని పండిస్తారని, జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు. రాయలసీమకు నీళ్ళు రావాలంటే ప్రాజెక్టు లు బాగు చేయాలిని బాబు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు