CHANDRABABU CASES: మూడు కోర్టుల్లో చంద్రబాబు కేసుల మీద నేడు విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు మీద ఈ రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అధికారుల కాల్ రికార్డ్ ఇవ్వాలంటు చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్నారు. దీని మీద ఈ రోజు కూడా ఇరు వర్గాల తరుఫు లాయర్లు వాదించనున్నారు. ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ తరువాత ఏసీబీ కోర్టు జడ్జిలు తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా నేడు తీర్పు రానుంది. By Manogna alamuru 13 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి అంగళ్ళ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారం అంటే ఈరోజు చెబుతామని కోర్టు తెలిపింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల తాలూకు ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ గతంలోనే ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. చంద్ర బాబు రేచ్చగోట్టే వ్యాఖ్యల చేశాడని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాన్ని పెన్ డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు మీద ఫిర్యాదును ఆలస్యంగా చేశారని బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఘటన పై ఆలస్యంగా ఫిర్యాదు చేసినా జరిగిన ఘటనలు మొత్తాన్ని కంప్లైంట్ లో తెలిపామన్నారు సుధాకర్ రెడ్డి. మరోవైపు ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు కేసు మీద ఈరోజు విచారణ జరగుతుంది. దీన ఇమీద కూడా జడ్జిలు ఈరోజు తీర్పు ఇస్తారని తెలుస్తోంది. ఇక నేడు సుప్రీంకోర్టులో మరోసారి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని కేసును కొట్టివేయాలని ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలని బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని మీద ఇంతకు ముందే విచారణ జరిగింది. ఈరోజు జస్టిస్ అనిరుధ్ బోస్ జస్టిస్ బేల, ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈరోజు చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించునున్నారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులోనూ సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడాన్ని బాబు తరుఫు న్యాయవాదులు సుప్రీంలో సవాలు చేశారు. Also Read:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్ బుకింగ్ #andhra-pradesh #high-court #acb #cases #supreme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి