chandrababu case:చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు జరగనుంది. జాబితాలో చిట్టచివరి కేసుగా బాబు కేసును లిస్ట్ చేశారు.

New Update
chandrababu case:చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ మీద సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని బాబు పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించనున్నారు. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం ఈ కేసు కోర్టుకు రాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఆ తరువాత విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. బాబు కేసుకు మరో బెంచ్ కేటాయించి ఈరోజు విచారణ జరుపుతామని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరుపు లాయర్లు వాదించనున్నారు. సుప్రీంకోర్టులో 63వ ఐటమ్ గా లిస్ట్ అయింది. బాబు తరుపున సిద్ధార్ధ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు లాయర్లగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది.

కేవియట్ పిటిషన్ దాఖలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో తన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తమ వాదనను వినాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏపీఎస్ఎస్డీసీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు పాత్రను నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ స్టాండింగ్ కౌన్సెల్ మహ్ఫూజ్ అహ్సాన్ నజ్కీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాననే నెపంతో టీడీపీ అధినేత ఈ మోసానికి పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులను తిరిగి షెల్ కంపెనీలకు మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నట్లు తెలిపింది. నిధుల దుర్వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని, వాస్తవానికి ఈ కుంభకోణం గురించి జీఎస్టీ శాఖే ప్రభుత్వానికి తెలియజేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. దీని మీద కొంతకాలంగా హైకోర్టులో వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2:15 కి మళ్ళీ విచారణ జరుగుతుంది.

మరోవైపు టీడీపీ నిన్న సత్యమేవజయతే దీక్ష పేరుతో చేపట్టిన ఆందోళన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అటు చంద్రబాబు సైతం జైల్లో ఒక్క పూట ఉపవాసం ఉండి దీక్షను చేశారు. దీంతో అమరావతిలో రాత్రికి రాత్రి టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. అచ్చెన్న నాయుడు అధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో తరువాత ఏం చేయాలి అన్న దాని మీద చర్చించినట్టు సమాచారం. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబును ఎటువంటి ఆధారం లేని కేసులో అరెస్టు చేశారని మండిపడ్డారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తప్పు చేయలేదు... ఎవరినీ చేయనివ్వలేదని పేర్కొన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఈరోజుతో 25 రోజులు ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఆయన కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి:తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన 

ఏపీలో తగ్గని వైసీపీ హవా…టైమ్స్ నౌ సంచలన సర్వే…వివరాలివే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు