minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు

రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు.

New Update
minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు

రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు. ఐటీ, సీఐడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఉన్న భారతదేశంలో చంద్రబాబు లాంటి అవినీతిపరుడు ఎటూ తప్పించుకోలేరన్నారు. అతని స్కామ్‌లను ఈ దర్యాప్తు సంస్ధలే బయటపెట్టాయని మంత్రి తెలిపారు. చంద్రబాబు 70కి పైగా సెల్‌ కంపెనీల ద్వారా డబ్బును వెనక్కి రప్పించి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు చంద్రబాబే అన్న మంత్రి.. అతని అభియోగంపై విచారించడానికి ఈ దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులోఎ ఏ1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబుకు కఠిన శిక్ష తప్పదని మంత్రి చెల్లబోయిన స్పష్టం చేశారు. అతను చేసిన అవినీతి కుంభకోణం బయటపడటంతో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్‌ చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి వేణు మండిపడ్డారు. తాను చేసిన అవినీతి బయట పడకుండా చంద్రబాబు అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేశారన్న ఆయన.. కానీ దర్యాప్తు సంస్థలను మ్యానేజ్‌ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం వ్యవహరిస్తూ వెళ్తాయన్నారు. పాలకుడిగా ఉండాల్సిన చంద్రబాబు ప్రస్తుతం ప్రజా ద్రోహిగా మారారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. లోకేష్‌ యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలతో యువగళం పాదయాత్రను మ్యానేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలతో ఎంత సేపటికీ మ్యానేజ్‌ చేసినా ఫలితం రాలేదన్నారు. దీంతో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ నిర్వహిస్తున్న వారాహీ యాత్ర ప్రజలను రెచ్చగొట్టేలా ఉందన్నారు. తండ్రి, కొడుకు, దత్తపుత్రుడు కలిసి రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తున్నారని మంత్రి చెల్లబోయిన వేణు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు హింస సృష్టించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు