Supreme Court: ఎస్సీ ఉపవర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది: సుప్రీంకోర్టు రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపరవర్గీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అన్ని కులాలు ఏక స్థితిలోనే ఉన్నాయని భావించలేమని తెలిపింది. By B Aravind 08 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఉపరవర్గీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వందల ఏళ్ల పాటు అణిచితవేతకు గురైన వర్గాలకు న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని.. దాని లక్ష్య్ం నెరవేర్చేందుకే ఉపవర్గీకరణ ఓ సానుకూల చర్య అంటూ పేర్కొంది. అయితే వీటిని ఉపరవర్గీకరించే అధికారం.. రాష్ట్రాలకు లేదన్న 2004 నాటి సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల ధర్మాసం విచారణ చేపట్టింది. ఆ తీర్పులో లోపాలున్నాయ్ చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మసానం ముందు రెండో రోజు బుధవారం కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై.. తన వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్ల ఉపరవర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిచడమే అవుతుందని 2004లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఇందులో లోపాలున్నట్లు తుషార్ మెహతా ఇన్నారు. Also Read: స్కూల్ సెలవుకోసం 1వ తరగతి బాలుడిని చంపిన విద్యార్థి ఆ వర్గాల్లో అందరూ ఓకే స్థితిలో ఉన్నాయని చెప్పలేం ఎస్సీ జాబితాలో ఉన్న కులాల్లో కూడా ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వ్యత్యసాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాళ్లలో బాగా వెనకబడిన వాళ్లకే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు దక్కేలా రిజర్వేషన్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అయితే సామాజిక, ఆర్థిక, విద్య స్థాయిలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అన్ని కులాలు ఏక స్థితిలోనే ఉన్నాయని భావించలేమని.. సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రత్యేక ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో ఈ రెండు వర్గాలు సజాతీయతను కలిగి ఉన్నాయని చెప్పారని.. అయితే అన్నింటికీ దాన్ని వర్తింపజేయలేమని పేర్కొంది. సమానత్వానికి కృషి జరగాలి అలాగే 2004 నాటి సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని.. ధర్మాసనం బధవారం చేపట్టిన విచారణ సందర్భంగా తెలిపింది. మరోవైపు రాష్ట్రాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా వాదిస్తూ.. అణిచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో కులాల మధ్య కూడా సమానత్వానికి కృషి జరగాల్సి ఉందని చెప్పారు. ఎస్సీ కేటగిరీలో ఉన్న అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు ఒకేతీరుగా ఉన్నాయని చెప్పలేమన్నారు. ఆయన కూడా 2004 తీర్పును తప్పుబట్టారు. మరోవైపు అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, మాజీ అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపా సహా పలువురు సీనియర్ న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించారు. ఇక గురువారం కూడా ఈ అంశంపై విచారణ కొనసాగనుంది. Also read: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!! #national-news #supreme-court #sc #st మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి