Hacking: హ్యాకింగ్ అలెర్ట్ దుమారం.. యాపిల్‌ కంపెనీకి నోటీసులు పంపిన కేంద్రం

యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్‌ మెసేజ్‌ వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు పంపించింది. ఈ అలర్ట్ మెసేజ్‌లను ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.

New Update
Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు

ఇటీవల విపక్ష ఎంపీలకు యాపిల్ సంస్థ నుంచి హ్యాకింగ్ అలెర్ట్ మెసేజ్‌ రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ యాపిల్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వ్యక్తులు హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన అలెర్ట్ మెసేజ్‌ను ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని యాపిల్ సంస్థకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ నోటీసులు పంపిన విషయాన్ని వెల్లడించారు. అలాగే హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలపై భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఎజేన్సీ, అలాగే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) కూడా దర్యాప్తు చేస్తోందని తెలిపారు.

Also read: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం

అయితే విపక్ష ఎంపీల ఐఫోన్లకు అలర్డ్ నోటిఫికేషన్లు రావడంపై ఇంతకుముందే యాపిల్ స్పందించింది. తన కంపెనీ నుంచి వచ్చిన అలర్ట్ నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని స్పష్టం చేసింది. అలాగే ఒక్కోసారి యపిల్ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్ నోటిఫికేషన్లు నకిలి హెచ్చరికలు కూడా అయి ఉండొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే వ్యక్తుల ద్వారా హ్యాకంగ్ ప్రయత్నం జరిగిందని మంగళవారం పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను ఖండించిన కేంద్రం.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని.. దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపింది. అయితే ఇలా యాపిల్ నుంచి అలెర్టు మెసేజ్ వచ్చిన వారిలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు నేతలు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీలకు కూడా అలర్డ్ మెసేజ్‌లు రావడం గమనార్హం.

అయితే ఈ పరిణామాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కూడా స్పందించారు. ఈ అలర్ట్‌ నోటిఫికేషన్లు ఇండియాతో సహా 150 దేశాల్లోని యూజర్లకు వచ్చినట్లు యాపిల్‌ వర్గాలు స్పష్టం చేశాయని తెలిపారు. ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా వస్తుంటాయని ఆ సంస్థ చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పిటికే దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించామని.. ఈ మెసేజ్‌లు వచ్చినవారు దర్యాప్తునకు సహకరించాలని కోరుతున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇలా యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌ రావడం అనేది భద్రతా లోపం కారణంగా జరిగిందా, ఎవరైనా కావాలనే పంపించారా లేదా నిజంగానే ఎవరైనా హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రం ఇప్పుడు తాజాగా నోటీసులు పంపించడంతో యాపిల్ ఏం సమాధం ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు