Union Budget 2024: పవన్ ఆశించినట్లే జరిగింది.. బడ్జెట్ పై నాదెండ్ల ఫస్ట్ రియాక్షన్! ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించడంపై నాదెండ్ల మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయంలో పవన్ కల్యాణ్ ఆశించిందే జరిగిందన్నారు. జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలు కోసం అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. By srinivas 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Nadendla Manohar: ఏపీకి కేంద్రం భారీ నిధులు కేటాయించడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవణ్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏదైతే ఆశించాడో అదే జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మనోహర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ఒక స్థానం కల్పించింది. ఏదైతే పవణ్ కళ్యాణ్ ఆశించాడో అదే జరిగింది. గత ప్రభుత్వంలో ఏపీ అనాథ రాష్ట్రంగా మిగిలింది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ కూటమి రాష్ట్ర అభివృధి బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోవడంలేదని ప్రజలు అనుకోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అడిగినందుకు అభినందిస్తున్నా. ఎటాంటి స్వార్థం లేకుండా ప్రజలు కోసం అంకిత భావంతో పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో చెప్పిన మాటను కచ్చితంగా పటిస్తామన్నారు. ఇది కూడా చదవండి: AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ! ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమాచారం అందించారు. పార్టీ తరఫున చీఫ్ విప్‌గా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌లు నియమితులయ్యారు. #pawan-kalyan #nadendla-manohar #union-budget-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి