Central Govt Debt: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పు.. విదేశీ రుణాలతో కలుపుకొని రూ.185 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని తెలిపింది. 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది.

New Update
Central Govt Debt: ఈ ఏడాదిలో రూ.185 లక్షల కోట్లకు దేశ అప్పు: కేంద్రం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అప్పు.. విదేశీ రుణాలతో కలుపుకొని రూ.185 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో 56.8 శాతానికి సమానమని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి వెల్లడించారు. 2024 మార్చి చివరి నాటికి కేంద్రం అప్పు రూ.171.78 లక్షల కోట్లుగా ఉందని పంకజ్‌ చౌధరి పేర్కొన్నారు. జీడీపీలో ఈ మొత్తం 58.2 శాతానికి సమానమని తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Also read: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు?

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వరల్డ్‌ ఔట్‌ లుక్‌ ప్రకారం చూసుకుంటే.. 2024 ఏప్రిల్ నాటికి స్థిర ధరల వద్ద దేశ జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లు దాటినట్లు పేర్కొన్నారు. అలాగే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం,2014 ప్రకారం వెనుబడిన ఏడు జిల్లాలకు రూ.2100 కోట్లు సాయం అందించాలని నీతి ఆయోగ్ సూచించినట్లు పంకజ్‌ చౌధరి మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇందులో ఒక్కో జిల్లాకు రూ.300 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అయితే ఇప్పటిదాకా ఏపీలో వెనకబడిన జిల్లాలకు రూ.1750 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక సాయం కింద పలు రాష్ట్రాలకు ఈ తరహాలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను బడ్జెట్‌లో అందజేస్తుందని స్పష్టం చేశారు.

Also Read: మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది: రాహుల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు

ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.

New Update
RBI Governor

RBI Governor Photograph: (RBI Governor )

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గించింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింది.

సంజయ్ మల్హోత్రా గవర్నర్‌గా చేపట్టిన తర్వాత..

ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కూడా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. సంజయ్ మల్హోత్రా రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవ సమావేశం. అయితే మల్హోత్రా తన మెుదటి సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment