Big Breaking: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ మార్పు.. ఈసీ కీలక ప్రకటన!

రాజస్థాన్ ఎన్నికల తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. ఆ తేదీని 25కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

రాజస్థాన్ ఎన్నికల తేదీని మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎలక్షన్ కమిషన్ (CEC). ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఆ రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఆ తేదీని 25కు మార్చుతూ నిర్ణయం తీసుకుంది ఈసీ. ఆ రోజు రాష్ట్రంలో భారీగా శుభకార్యాలు/వివాహలు ఉండడంతో తేదీ మార్చాలని ఎన్నికల కమిషన్ కు వివిధ రాజకీయ పార్టీలు, పక్షాల నుంచి భారీగా వినతి పత్రాలు అందాయి. ఈ నేపథ్యంలో రవాణా తదితర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన కమిషన్ ఎన్నికల తేదీని మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Big Breaking: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. కీలక ఆదేశాలు జారీ!
publive-image publive-image

సవరించిన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 30
నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: నవంబర్ 6
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 7
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ: నవంబర్ 9
పోలింగ్: నవంబర్ 25
కౌంటింగ్: డిసెంబర్ 3

Advertisment
Advertisment
తాజా కథనాలు