National : సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం నిన్న ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. By Manogna alamuru 05 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Cabinet Meeting : ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం సభ్యులంతా ఇవాళ రాజీనామా (Resign) చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది కన్ఫామ్ కాలేదు. ఎన్డీయే (NDA), ఇండియా కూటమిలు (INDIA Alliance) రెండూ ఎవరికి వారు పావులు చకచకా కదుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాకు బలం సమకూర్చుకునే పనిలో పడ్డారు. టీడీపీ, జేడీయూ అధినేతలతో మాట్లాడడం గురించి ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చెప్పారు. మరోవైపు ఎన్డీయే పక్షాలు సమావేశం అవుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు మోదీ నివాసంలో కలవనున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు. దీనికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, జేడీయూ ఛీఫ్ నితీష్ కుమార్లు హాజరవుతున్నారు. Also Read:Elections 2024: లోక్సభ ఎన్నికల్లో నమోదైన అత్యంత అల్ప మెజారిటీ #central-cabinet-meeting #nda #india-alliance-meeting సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి