Mahua moitra: మరిన్ని చిక్కుల్లో మహువా.. రంగంలోకి దిగిన సీబీఐ.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లోక్‌పాల్ ఆదేశాల మేరకు సీబీఐ పార్టీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా మహువాపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే దానిపై సీబీఐ నిర్ణయం తీసుకోనుంది. By B Aravind 25 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల టీఎంసీ నేత, ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హిరానందని నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశానని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబై గతంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో లోక్‌పాల్ ఆదేశాల మేరకు సీబీఐ(CBI) పార్టీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మహువా మొయిత్రాపై ప్రాథమిక విచారణను నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఎంపీ మహువాపై వచ్చిన ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు అర్హత కలిగి ఉన్నాయా లేదా అని అధికారులు తెలుసుకోనున్నారు. అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాల ఆధారంగా మహువాపై కేసు నమోదు చేయాలా? వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. Also Read: కేరళలోని కొచ్చిలో ఘోర ప్రమాదం, సంగీత కచేరీలో తొక్కిసలాట, 4 విద్యార్థులు మృతి..!! లోక్‌పాల్ ఆదేశాల ఆధారంగా ఈ విచారణ ప్రారంభించినందు వల్ల.. ఈ ప్రాథమిక విచారణ నివేదికను సీబీఐ.. ఆ సంస్థకే అప్పగించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ వ్యవహారంపై మాత్రం లోక్‌పాల్, సీబీఐల నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదాల ఉండగా.. అదానీ గ్రూప్, ప్రధాన మోదీ టార్గెట్‌గా ఎంపీ మహువా మొయిత్రా.. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు. అనంతరం మహువాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సైతం లేఖ రాశారు. అయితే స్పీకర్ సిఫార్సు మేరకు దీనిపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసింది. అయితే ఈ క్రమంలోనే మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. Also Read: ప్రధాని మోదీ పర్యటనలో సెక్యూరిటీ లోపం.. ఎస్పీపై వేటు.. #telugu-news #cbi #national-news #mahua-moitra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి