NEET: నీట్ పేపర్ లీక్ కీలక సూత్రధారి అరెస్ట్

నీట్ పేపర్ లీకేజ్ వెనుక అసలు సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పట్నాలో ఇతనిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటూ రాజేష్ దగ్గర కీలక పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.

New Update
NEET: నీట్ పేపర్ లీక్ కీలక సూత్రధారి అరెస్ట్

Paper Leakage: నీట్, యూజీ పరీక్షల అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుల్లో కీలక సూత్రధారి అని భావిస్తున్న రాజేష్ రంజన్‌ను పట్నాలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తరువాత పట్నా, కోలకత్తాల్లో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత నీట్ పేపర్ లీకేజికి సంబంధించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. రాజేష్‌ ను విచారించేదుకు కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అగీకరించింది. ఇంతకు మందు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అెస్ట్ అయిన వారి సంఖ్య పదికి చేరుకుంది.

మరోవైపు దేశవ్యాప్తంగా నీట్ మీద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వారితో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ అయ్యారు. నీట్‌ పరీక్షపై గందరగోళం, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం తద్వారా విద్యా సంవత్సరం మరింత ఆలస్యంగా మొదలుకావడం వంటి అంశాలను చర్చించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నందువలన...న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.

Also Read:Jaipur: సెక్యూరిటీ ఆఫీసర్‌ను చెప్పుతో కొట్టిన స్పైస్ జెట్ ఉద్యోగిని

Advertisment
Advertisment
తాజా కథనాలు