NEET-PAPER: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు..

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్‌.. పంకజ్‌కు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

New Update
NEET-PAPER: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు..

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ చేస్తోంది. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లలో పలువురిని అరెస్టు చేసి అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారు బీహార్‌లోని పాట్నాకు చెందిన పంకజ్‌ కుమార్, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన రాజు సింగ్‌గా గుర్తించారు. అయితే పంకజ్‌ కుమార్‌ పేపర్ లీక్ మాఫియాలో ఉన్న వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఇతడు నీట్‌ -యూజీ పేపర్లను దొంగిలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ పేపర్‌ను లీక్ చేయండలో రాజు సింగ్‌.. పంకజ్‌కు సాయం చేసినట్లు భావిస్తున్నారు.

Also Read: 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి!

ప్రస్తుతం వీళ్లద్దరినీ సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలాఉండగా.. నీట్‌ పేపర్‌ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకీ అలియస్ రాకేష్‌ రంజన్‌తో పాటు మరో 13 మంది నిందితులను జులై 12న అధికారులు కస్టడిలోకి తీసుకున్నారు. ఇక మరోవైపు నీట్‌ పేపర్ అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత గురువారం విచారణ చేసింది. అయితే ఈ కేసులో వాదనలకు ముందు అఫిడవిట్లను పరిశీలించాల్సి ఉండటం వల్ల సీజేఐ ధర్మాసనం జులై 18కి విచారణను వాయిదా వేసింది.

Also Read: IAS పూజా ఖేద్కర్ శిక్షణను సస్పెండ్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం!

Advertisment
Advertisment
తాజా కథనాలు