Ship Hijacked:అరేబియా మహాసముద్రంలో 15 మంది భారతీయులన్న షిప్ హైజాక్ సోమాలియా తీరంలో మరో షిప్‌ను హైజాక్ చేశారు. ఇందులో దాదాపు 15 మంది దాకా భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. హైజాక్ గురైన కార్గో షిప్ నౌకా సిబ్బందితో భారత నౌకాదళం ఐఎన్ఎస్ కమ్యూనికేషన్ చేస్తోంది. ప్రస్తుతానికి ఇందులో ఉన్నవారందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. By Manogna alamuru 05 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ship Hijacked:అరేబియా మహాసముద్రంలో(Arabian Sea) మరో నౌక హైజాక్‌కు గురైంది. సోమాలియా(Somalia) తీరానికి దగ్గరలో ఈ షిప్‌ను హైజాక్ చేశారు. నిన్న సాయంత్రం ఇది జరిగిందని తెలుస్తోంది. హైజాక్ చేసిన ఓడ మీద లైబీరియా జెండా ఉంది. ఎమ్వీ లీలా నార్‌పోక్ అనే కార్గో షిప్‌ను(Cargo Ship) గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేసినట్టు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్ తెలిపింది. నిన్న సాయంత్రం 5 లేదా ఆరు మంది గుర్తు తెలియని సిబ్బంది ఓడ ఎక్కారని తరువాత దానిని తమ అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. వీరి దగ్గర ఆయుధాలున్నాయని కూడా చెప్పింది. ఈ షిప్‌లో 15 మంది దాకా భారతీయులు(Indians) ఉన్నారు. Also read:సూపర్ విక్టరీతో డబ్ల్యూటీసీ పట్టికలో టాప్ ప్లేస్‌కు భారత్ షిప్‌ను పరిశీలిస్తున్న ఐఎన్ఎస్.. షిప్ హైజాక్ సమాచారం అందుకున్న భారత నౌకాదళం(Indian Navy) వెంటనే స్పందించింది. సముద్రగస్తీ కోసం కేటాయించిన ఐఎన్ఎస్(INS) చెన్నైను రంగంలోకి దించింది. దీంతో పాటూ ఎయిర్ క్రాఫ్ట్ను(Air Craft) కూడా పంపించింది. ఐఎన్ఎస్ యుద్ధనౌక కార్గో షిప్ దగ్గరగా మూవ్ అవుతూ నిశితంగా పరిశీలిస్తోంది. నౌకా సిబ్బందితో కమ్యూనికేషన్‌ను ఏర్పరుచుకుంది. షిప్‌లో ఉన్న భారతీయులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు తెలిపారు. అరేబియా సముద్రం మీద భారత నిఘా.. అరేబియా సముద్రంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ భారత్ నౌకాదళం తన నిఘాను పెంచింది. ఈ వారం మొదటిలో చాలా మంది చేపలు పట్టేవారు ఓడను ఎక్కారని భారత నౌకాదళం అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. గుజరాత్ తీరంలో డ్రోన్ అటాక్.. గుజరాత్ తీరంలో ఒక వ్యాపారనౌక మీద డ్రోన్ దాడి జరిగింది. ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందినదిగా చెబుతున్నారు. దీని మీద లైబీరియా జెండా ఉంది. ఈ నౌకమీద గుర్తు తెలియని వ్యక్తు దాడి చేశారని మారిటైమ్ ఏజెన్సీ వెల్లడించింది. భారత్ లోని వెరావల్ తీరానికి నైరుతిదిశగా దాదాపు 200 కి.మీల దూరంలో ఈ ఘటన జరిగిందని మారిటైమ్ తెలిపింది. డ్రోన్ తో దాడి చేయడం వలన నౌకలోని రసాయన పదార్ధాలున్న ట్యాంకర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. షిప్ లో కొంతమేర మాత్రం దెబ్బ తింది. డ్రోన్ దాడి సమాచారం అందుకున్న భారత నేవీ వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ ను సహాయానికి పంపించింది. #arabian-sea #somalia #indians #cargo-ship #hijack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి