NEET: నీట్ వివాదంలో 13 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్

నీట్ ఎగ్జామ్ వివాదంలో బీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా 13 మంది ఛార్జ్‌ షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించింది. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, పేపర్ లీకేజ్ చేసిన వారు అందరూ ఉన్నారు.

New Update
NEET: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్‌ లింక్

CBI Charg Sheet: నీట్‌ లీక్‌ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్‌ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. దీనిలో ఇప్పుడు కీలకపరిణామం చోటు చేసుకుంది. సీబీఐ 13 మంది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీటును కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 15 మంది బీహార్ వాసులే ఉన్నారు. ఇందులో ఐదుగురు ఇన్విజిలేటర్లు, ఇద్దరు పరిశీలకులు, ఒక సెంటర్ సూపరింటెండెంట్,  ఒక ఇ-రిక్షా డ్రైవర్, ఇద్దరు ఎగ్జామ్ రాసిన విద్యార్ధులు ఉన్నారు. నిందితులిద్దరూ భరత్‌పూర్‌ మెడికల్ కాలేజీ విద్యార్థులు కమార్‌ మంగళం బిష్ణోయ్, దీపేందర్ కుమార్‌లుగా గుర్తించారు. వీళ్లిద్దరూ గతంలో అరెస్టయిన ఇంజనీర్‌ పంకజ్ కుమార్‌ నీట్ పేపర్ ను దొంగిలించడంలో సాయం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్‌పూర్‌కు (జార్ఖండ్)చెందిన 2017-బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్.. హజారీబాగ్‌లోని ఎన్టీయే ట్రంక్ నుంచి నీట్‌ పేపర్‌ను దొంగిలించాడని ఆరోపణలు రావడంతో అతడిని సీబీఐ కొన్నిరోజుల క్రితమే అరెస్టు చేసింది. దీంతో పాటూ సీబీఐ మొత్తం 48 చోట్ల సోదాలు నిర్వహించింది.

Also Read:Paris Olympics: బాక్సర్‌‌ను చితక్కొట్టి బయటకు పంపించిన లింగనిర్ధారణ ఫెయిల్ అయిన కంటెస్టెంట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

today-latest-news-in-telugu | one-day | cricket | icc

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

 

 

Advertisment
Advertisment
Advertisment