Healthy Food:పెరుగులో పసుపు వేసుకుని తినొచ్చా.. తింటే ఏమవుతుంది? పెరుగు, పసుపు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. పసుపు, పెరుగులో ఉండే కర్కుమిన్, కాల్షియం, ప్రోటీన్లు, బి విటమిన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు శరీరంలోని కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. By Vijaya Nimma 13 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Healthy Food: మన ఆరోగ్యానికి సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని కలిపి తీసుకుంటే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెరుగు, పసుపు అలాంటి వాటిలో ఒకటి. పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు, బి విటమిన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడటం గురించి మనం విన్నాం. అయితే వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వీటిని కలిపి ఎక్కువగా తీసుకుంటారు. ఐరన్ టానిక్: ఇది ఐరన్ టానిక్ ప్రయోజనాలతో కూడిన మంచి కాంబో. ఈ మిశ్రమం శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో, రక్తహీనతను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు వ్యాధులకు ప్రధాన కారణాలు. శరీరంలోని కఫ దోషాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి: పెరుగు, పసుపు తినడంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. గ్యాస్, అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి ఈ కాంబో చాలా మంచిది. జీవక్రియను పెంచి కొవ్వు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. పసుపు సాధారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఇది గ్రేట్‌గా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ కాంబో చాలా మంచిది. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలను నివారిస్తుంది. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అలెర్జీ సమస్యలను నివారించడానికి ఈ కాంబో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యం కోసం: ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది. పెరుగులో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. మరోవైపు పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాకంఉడా కీళ్లలో వాపు తగ్గుతుంది. ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పి నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మిలెట్స్ పాయసం ఎప్పుడైనా ట్రై చేశారా?.. 15 నిమిషాల్లో చేసేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #curd #turmeric మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి