Nerve Problems : నరాల సమస్యలు ప్రాణాంతకం అవుతాయా?

నరాల సమస్య శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. నాడీ వ్యవస్థలోని ఏదైనా భాగం వ్యాధి బారిన పడినప్పుడు నడవడం, మాట్లాడటం, తినడం, శ్వాస తీసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సమస్యలు వస్తాయి.

New Update
Nerve Problems : నరాల సమస్యలు ప్రాణాంతకం అవుతాయా?

Nerve Problems : ఈ రోజుల్లో యువత(Youth) ఎక్కువగా నరాల సమస్య(Nerve Problems) లతో బాధపడుతున్నారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా జీవన నాణ్యతను దెబ్బతీస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ది లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌(The Lancet Neurology Journal) లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం 2021 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల మందికి పైగా ప్రజలు వివిధ రకాల నరాల సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది.

నరాల సమస్యలు:

  • మన మెదడు(Brain), వెన్నెముక, నరాలు కలిసి నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఈ వ్యవస్థ శరీరంలోని అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థలోని ఏదైనా భాగం వ్యాధి బారిన పడినప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. నడవడం, మాట్లాడటం, తినడం, శ్వాస తీసుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి బలహీనపడి మానసిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. నరాల సమస్య కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు.

ప్రాణాంతకం అవుతుందా..?

  • లాన్సెట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం కాలుష్యం, జీవక్రియ, జీవనశైలి వల్ల నరాల సమస్యలు వస్తున్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 31 ఏళ్లలో న్యూరోలాజికల్ పరిస్థితుల కారణంగా వైకల్యం, అకాల మరణాల కేసులు పెరిగాయని పరిశోధకులు అంటున్నారు.

టాప్ 10 నరాల సమస్యలు:

  • 2021 సంవత్సరంలో ఎక్కువగా సంభవించే 10 నరాల సమస్యలలో స్ట్రోక్, నియోనాటల్ ఎన్సెఫలోపతి అంటే మెదడు గాయం, మైగ్రేన్, అల్జీమర్స్-డిమెన్షియా, డయాబెటిక్ న్యూరోపతి, మెనింజైటిస్, మూర్ఛ, పిల్లలలో అకాల పుట్టుక కారణంగా మరణాలు ఉన్నాయి. ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతలు, నాడీ వ్యవస్థ క్యాన్సర్లు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

పరిశోధకులు ఏమంటున్నారు..?

  • దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి సమస్యలు పెరిగాయని, న్యూరోలాజికల్ డిజార్డర్స్(Neurological Disorder) కారణంగా 80 శాతం కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. సమస్యలు పెరిగినా 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే నాడీ సంబంధిత సమస్యలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించారని అంటున్నారు. అన్ని దేశాలు దీనిని తీవ్రంగా పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : మైగ్రేన్ విషయంలో ఇవి గుర్తుంచుకోండి.. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు