Cotton Candy: కాటన్ కాండీ తింటే క్యాన్సర్ వస్తుందా..ఎందుకు దీన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి?

వారం రోజులుగా కాటన్ కాండీ గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అని తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి. అసలు నిజంగానే ఇది తింటే క్యాన్సర్ వస్తుందా? రోడ్‌మైన్‌ బి అంటే ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కింది కథనంలో చూద్దాం.

New Update
Cotton Candy: కాటన్ కాండీ తింటే క్యాన్సర్ వస్తుందా..ఎందుకు దీన్ని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి?

Colorful Cotton Candy: నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే పీచు మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకూ దీన్ని అమిత ఇష్టంగా తింటారు. ఎక్కడ కనిపించినా వెంటనే కొనేస్తుంటారు కూడా. ఒక పుల్ల చుట్టూ రకరకాల ఆకారాల్లో తయారు చేసి ఇచ్చే కాటన్ క్యాండీ అంటే మీకు కూడా ఇష్టమా..చూడగానే నోట్లో వేసేసుకుంటారా..అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి.

నోరూరించే కాటన్ క్యాండీ..

కాటన్ క్యాండీని మన దేశంలో కొన్ని చోట్ల నిషేధించారు. తమిళనాడు, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో దీన్ని అమ్మకూడదు, తినకూడదు. ఈ పీచు మిఠాయి తింటే అనారోగ్యం పాలవుతారు అని చెబుతున్నాయి ఆ రాష్ట్రాలు. ఈ కాటన్ క్యాండీని చక్కెరతో తయారుచేస్తారు. షుగర్‌ సిరప్‌ను ఒక యంత్రంలో వేయడం ద్వారా పోగులు వచ్చేటట్టు చేస్తారు. ఇవి వెంట్రుక కంటే తక్కువ మందంలో ఉంటాయి. దాన్ని ఒక ఆకారంలో ఒక చోట చేర్చి పీచు మిఠాయి లేదా కాటన్ క్యాండీగా అమ్మతారు. దీన్ని రకరకాల రంగుల్లో కూడా తయారు చేస్తారు. ఈ పీచుమిఠాయి దూదిలా మెత్తగా ఉండి, తియ్యగా నోట్టో వేసుకోగానే కరిగిపోతుంది.

విషపూరితమైన ద్రావణాలు..

అయితే ఈ కాటన్ క్యాండీ అమ్మేవాళ్ళు ఆకర్షణీయంగా ఉండడానికి, లాభాల కోసం ఇందులో విషపూరితమైన కెమికల్స్ కలుపుతున్నారు. వీటిల్లో సింథటిక్ అధికంగా ఉంటోంది. అంతేకాదు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే రోడమైన్ బి, మెటనిల్ ఎల్లో లాంటివి అనారోగ్యకర పదార్ధాలు కూడా ఉంటున్నాయి. వీటిల్లో కాన్సర్ కారకం ఉంటుంది. అందుకే కాటన్ క్యాండీ తింటే క్యానస్ర్ వస్తుందని చెబుతున్నారు. ఒకవేళ రసాయనాలు కలపకపోయినా...నేచురల్ కలర్‌తోనే ఇచ్చినా కూడా దీనిని తినడం అంత మంచిది కాదు అంటున్నారు. ఎందుకంటే వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో పీచు మిఠాయి తయారు చేసే మిషన్ నుంచి ఇనుప ముక్కలు విడిపోయి తినే పదార్థంలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటి శాంపిళ్ళను పరీక్షించిన తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పీచు మిఠాయిని నిషేధించారు.

అస్సలు మంచిది కాదు...

ఈమధ్య జరిగిన తెలంగాణ మేడారం జాతరలో కూడా కొన్ని చోట్ల కాటన్ క్యాండీని బ్యాన్ చేశారు. అయితే ఈ రోడమైన్‌ బీ అన్నది ఒక్క పీచు మిఠాయిలోనే కాదు చాలా పదార్ధాల్లో కలుపుతున్నారని అంటున్నారు ఫుడ్ సైంటిస్టులు. కారం పోడిలోనూ, జెల్లీ, క్యాండీలు లాంటి వాటిల్లోనూ కూడా ఉంటోందని చెబుతున్నారు. ఇది జెనోటాక్సిక్, డీఎన్‌ఏపై ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించి క్యాన్సర్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. అంతేకాదు రోడమైన్ బి కలిపిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశయాంతర పేగులకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత అందులో ఉండే రసాయనాలు, విష పదార్థాలను కాలేయం, కిడ్నీలు విసర్జిస్తాయన్నారు. రోడమైన్- బి ఉన్న ఆహార పదార్థాల వల్ల కాలేయం, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, క్యాన్సర్లు రావచ్చని తెలిపారు.

రోడమైన్‌ బీ అంటే ఏంటి?

ఇది ఒక సింథటిక్ కలర్. దీనిని ఆహారంలో ఉపయోగించడం వలన రంగులు మరింత మెరుగ్గా కనిపించి తిండి పదార్ధం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ రసాయన ద్రావణాన్ని బట్టల తయారీ, కాగితం, తోలు పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తయారీకయ్యే ఖర్చు తక్కువగా ఉండటం, నీటిలో కలిసిపోవడం వల్ల పరిశ్రమలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. అంతేకాదు ఇది వేడిని కూడా తట్టుకుంటుంది. అందుకే దీన్ని ఫుడ్‌లో కూడా కలుపుతున్నారు.

Also Read:USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు