Space Station: 2033 నాటికి రష్యాకు సొంత స్పెస్ స్టేషన్ !

2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్.. రోస్కోస్మోస్ ప్రకటన చేసింది. ప్లాన్ ప్రకారం 2027లోగా స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని.. 2033 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.

New Update
Space Station: 2033 నాటికి రష్యాకు సొంత స్పెస్ స్టేషన్ !

2033 నాటికి తమ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్.. రోస్కోస్మోస్ ప్రకటన చేసింది. రష్యన్‌ ఆర్బిటల్‌ స్టేషన్‌ (ROS) నిర్మాణానికి సంబంధించిన వివరాలను రోస్కోస్మోస్‌ అధిపతి యూరీ బొరిసోవ్‌ మంగళవారం వివరించారు. ఆర్బిటల్ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టాలని 2021లో నిర్ణయించాం. ప్లాన్ ప్రకారం 2027లోగా స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. 2030 నాటికి యూనివర్సల్ నోడల్, కక్ష్య స్టేషన్‌లో ప్రధాన భాగాన్ని పూర్తి చేస్తాం. 2031 నుంచి 2033 వరకు రెండు ప్రత్యేక మాడ్యూల్స్‌ (TsM1, TsM2)ను స్టేషన్‌కు అనుసంధానం చేస్తాం. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.98 బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని' యూరీ బొరిసోవ్ తెలిపారు.

Also read: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే!

ఇదిలాఉండగా.. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాను ఒంటరి చేయాలని పాశ్చత్య దేశాలు దానిపై ఆంక్షలు విధించాయి. దీంతో ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకుంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయటకు వచ్చేస్తామని రష్యా అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ దీనిపై అమెరికా ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే ఐఎస్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది.

Also read: శాంతి వ్యవహారంలో కీలక మలుపు.. ఢిల్లీలో ధర్నా చేయనున్న మదన్‌మోహన్

Advertisment
Advertisment
తాజా కథనాలు