Vivo Y19s: వివో నుంచి కిక్కిచ్చే కొత్త ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవు !

టెక్ బ్రాండ్ వివో తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతు గల LCD డిస్ప్లేతో వస్తుంది. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దీని సొంతం. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి.

New Update
Vivo Y19s

Vivo Y19s: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో దేశీయ మార్కెట్‌లో దుమ్ముదులిపేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను లాంచ్ చేసింది. Vivo Y19s వై-సిరీస్ నుంచి తాజా మోడల్‌గా తీసుకొచ్చింది. ఇది Unisoc SoCలో పనిచేస్తుంది. 6GB RAMని కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతు గల LCD డిస్ప్లేతో వస్తుంది. 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు

దీంతోపాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లు ఇందులో అందిచబడ్డాయి. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Vivo Y19s మొబైల్‌ను కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతం ఇది కొనుగోలుకు అందుబాటులో లేదు.

ఇది కూడా చదవండి: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది

కంపెనీ దాని ధరను కూడా వెల్లడించలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఎఇ, రష్యా, సౌదీ అరేబియా, అనేక ఇతర దేశాలలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుందని లిస్టింగ్ చూపిస్తుంది. ఇది గ్లోసీ బ్లాక్, పెరల్ సిల్వర్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడింది. భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.

vivo y19s

Vivo Y19s Specifications

ఇది కూడా చదవండి: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

Vivo Y19s స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో)ను కలిగి ఉంది.  Vivo Y19s Android 14-ఆధారిత Funtouch OS 14పై నడుస్తుంది. ఇది 6.68-అంగుళాల HD+ (720x1,608 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6GB LPDDR4X RAMతో జత చేయబడిన 12nm ప్రాసెస్‌పై నిర్మించిన Unisoc T612 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందింది.

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

ఈ కొత్త Vivo స్మార్ట్‌ఫోన్ IP64 రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. Vivo Y19s 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ షూటర్‌ను కలిగి ఉంది. వివో స్మార్ట్‌ఫోన్‌లో టైప్-సి పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు