/rtv/media/media_files/2025/02/17/aTLR5pQCbuzSQCIxZaTJ.jpg)
Vivo V40e 5G available on Flipkart with Rs. 9000 discount
తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే Vivo V40e 5G అనేది మీకు గొప్ప ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9000 వరకు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ Vivo ఫోన్‌లో మీరు 50MP సెల్ఫీ కెమెరాతో పాటు 5500mAh బ్యాటరీని పొందుతారు. పూర్తి వివరాల విషయానికొస్తే..
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
Vivo V40e 5G Price and Offers
Vivo V40e 5G 8GB RAM / 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 33,999కి జాబితా చేయబడింది. అయితే ఇప్పుడు మీరు ఓహ్ మై గాడ్జెట్స్ సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. దాదాపు రూ.7000 తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత Vivo V40e 5G ఫోన్ రూ.26,999కి కొనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ కార్డ్ ద్వారా మరో రూ. 2000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌తో మీరు దీన్ని కేవలం రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే మొత్తం రూ.9వేల డిస్కౌంట్ లభిస్తుందన్నమాట.
Vivo V40e 5G Specifications
Vivo V40e 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ AMOLED 3D కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. Vivo V40e 5Gలో మెరుగైన పనితీరు కోసం MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ని అందించారు. ఇది 8GB RAM - 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. Vivo V40e 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. దీనితో పాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.