TG Ration Card: రేషన్ కార్డులకు కొత్త రూల్స్..ఆదాయం ఎంత ఉండాలో తెలుసా?

మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబ ఆదాయం ఆధారంగానే రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షలలోపూ ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

New Update
tg

TG Ration Card: తెలంగాణ ప్రజలకు మరో రెండు నెలల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కుటుంబాల వార్షిక ఆదాయం ఆధారంగానే కార్డులు ఇచ్చేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయ పరిమితి తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ చర్చిస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో అమల్లో ఉన్న విధానాలను ఇప్పటికే అధ్యయనం చేయగా.. నివేదికను ఉపసంఘానికి అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంక్షేమ పథకాల్లోనూ వినియోగం..
పౌరసరఫరాల వస్తువుల కోసమే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్, హెల్త్‌కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులు చేయనుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్‌లో రూ.2 లక్షలలోపు ఆదాయాన్ని కార్డుల జారీకి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. భూవిస్తీర్ణం తరి అయితే 3.5 ఎకరాలు, మాగాణికి 7.5 ఎకరాలలోపు ఉండాలని నిబంధన పెట్టనున్నారు.

వార్షికాదాయం అర్హతగా..

తెలంగాణలో 89.96 లక్షల కార్డులుండగా వాటి పరిధిలో 2.81 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, 5,416 కార్డులు అన్నపూర్ణ పథకాల కింద ఉన్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణం, అర్బన్‌ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితి ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధివిధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 21న నిర్వహించే తుది సమావేశంలోపు తుది నీర్ణయం వెల్లడించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి.

New Update
ice cream

ice cream

ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం మీ కోసం రెడీ అవుతుంది. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మూడవ ఎడిషన్ ఈ నెల 27న ఐస్‌క్రీమ్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను  ఎర్రమంజిల్‌లోని గలేరియా మాల్‌లో ప్రముఖ హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ,  నటుడు సమీర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పోటీ  పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ ఆసక్తికరమైన పోటీలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేయనున్నారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 50 వేలు,  మూడవ బహుమతిగా రూ. 25 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. మరో 25 మంది విజేతలను ఎంపిక చేసి, ఒక్కొ విజేతకు రూ. 5 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వాహకులు ఇవ్వనున్నారు.

 ఈ పోటీలు ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు స్వయంగా కళ్లకు గంతలు కట్టుకుని వివిధ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తించే ప్రయత్నం చేశారు.. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8008574747 నెంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్స్ సీఈఓ సుహాస్‌ బి. శెట్టి, ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ ఎండీ ఎం. రాజ్‌గోపాల్ , డాక్టర్ జె. సంధ్యారాణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఐస్‌క్రీమ్ రుచులను గుర్తించడంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన వేదికగా కూడా నిలవనుంది. 

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

hyderabad | ice-cream | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment