భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కారణం యుద్ధాలేనా? అంతర్జాతీయ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,264 పాయింట్లు నుంచి 693 పాయింట్లు తగ్గింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 03 Oct 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Stock Markets : అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్ల ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,264 పాయింట్లు పతనం కావడంతో ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 693 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ 83,572 పాయింట్ల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిఫ్టీ 211 పాయింట్లు తగ్గి 25,585 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇది కూడా చూడండి: కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు: కొండా సురేఖ సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్, టీసీఎస్, ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ కాకుండా మిగిలిన స్టాక్స్ అన్నీ కూడ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.91 వద్ద ప్రారంభమైంది. ఇది కూడా చూడండి: లైంగిక వేధింపుల కేసులో.. జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్! కారణలు ఇవేనా? ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధాలే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే యుద్ధాల వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అలాగే చైనా ఉద్దీపన ప్యాకేజీ, జపాన్ ముఖ్యమైన రేట్లను పెంచే అవకాశం ఉంది. ఇవి భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు జీఎస్టీ వసూళ్లు, తయారీ రంగంలో పీఎంఐ గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఇది కూడా చూడండి: కొండాసురేఖపై స్మిత సబర్వాల్ సంచలన పోస్టు.. ఏం అన్నారంటే? #stock-markets #nifty #sensex-crash-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి