Stock Markets : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. గత కొన్ని రోజుల నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 291 పాయింట్లతో 81,656 వద్ద ప్రారంభమవ్వగా.. సెన్సెక్స్ 307 పాయింట్లతో 81,688 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 25053 వద్ద ప్రస్తుతం ట్రేడవుతుంది. By Kusuma 14 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Stock Markets : గత కొన్ని రోజుల స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో ఉన్నాయి. ఐదు రోజుల పాటు నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు మధ్యలో ఒకసారి లాభాల బాట పట్టి మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఈరోజు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ 291 పాయింట్లతో 81,656 వద్ద ప్రారంభమై.. సెన్సెక్స్ 307 పాయింట్లతో 81,688 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 25053 వద్ద ట్రేడవుతుంది. ఇది కూడా చూడండి: Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే? లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు స్టాక్ మార్కెట్లో అశోక్ బిల్డ్‌కాన్, ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, థామస్ కుక్(ఐ), పాలీ మెడికేర్, డీసీఎం శ్రీరామ్ కంపెనీ షేర్లు ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కిర్లోస్కర్ బ్రదర్స్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, సరిగమఇండియా, సుదర్శన్ కెమికల్స్, బంధన్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇది కూడా చూడండి: సాయిబాబాకి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా.. ఇదిలా ఉండగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో హాంకాంగ్ తప్ప మొత్తం ప్రధాన సూచీలు సానుకూలంగానే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయ మారకం విలువ రూ.84.06గా ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 79.03 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం లాభాల బాట పడింది. ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ విద్యార్థి హత్య కేసు.. నిందితునికి 60 ఏళ్ల శిక్ష ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గత వారం నుంచి ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నిరవధిక అమ్మకాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రెండు వారాల నుంచి నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నాయి. కంపెనీలు ఈ వారంలో సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఇది కూడా చూడండి: Muthyalamma : అమ్మవారి విగ్రహం ధ్వంసం.. ఆలయం వద్ద పెరిగిన ఉద్రిక్తత #stock-markets #trading #stock-markets-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి