/rtv/media/media_files/2025/02/21/6m6TnctAm3CzJNnCxaZT.jpg)
smartphone Case Turned Yellow Clean and Clear tips
చాలా మంది తమ మొబైల్‌ను సేఫ్‌గా ఉంచుకోవడానికి సిలికాన్ కేస్ (బ్యాక్ పౌచ్)ను ఉపయోగిస్తారు. ఇది ఫోన్‌ను సేఫ్‌గా ఉంచడమే కాకుండా మొబైల్ అందాన్ని కూడా ఇతరులకు కనిపించేలా చేస్తుంది. అయితే ఆ కొత్త కవర్ కొన్ని రోజుల్లోనే పాతదిగా కనిపించడం ప్రారంభమవుతుంది. కొద్ది రోజులకే అది పసుపు రంగులోకి మారడం చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో దాన్ని పక్కన పడేసి కొత్తది కొనుక్కోవలసి వస్తుంది. అయితే ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. పసుపు కలర్‌లోకి మారిన మీ కేస్‌ను మళ్లీ కొత్తగా కనిపించేలా చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఇంటివద్దనే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడా అందరికీ తెలిసిందే. ఇది మొబైల్ కవర్ పై ఉన్న పసుపు రంగును తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనికోసం ముందుగా రెండు చెంచాల బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ లా చేయాలి. ఆ తర్వాత దాన్ని కేస్ కవర్‌కు అప్లై చేయాలి. కొంత సమయం అలాగే ఉంచిన తర్వాత, కవర్‌ను నీటితో కడగాలి. దీంతో పాత కలర్ పోయి మళ్లీ కొత్తగా కనిపిస్తుంది.
శానిటైజర్
శానిటైజర్ క్రిములను చంపడంతో పాటు, సిలికాన్ కవర్ నుండి పసుపు రంగును కూడా తొలగించడంలో ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కాటన్ ముక్క మీద శానిటైజర్ వేసి, దానితో ఫోన్ కవర్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. అలా కాసేపు తుడిచిన తర్వాత పాతదిగా కనిపించే కవర్ మెరుస్తూ ఉంటుంది.
టూత్‌పేస్ట్
టూత్‌పేస్ట్‌ను దంతాలను శుభ్రం చేయడానికి మాత్రమే కాదు.. బూట్లు ఉతకడానికి, ఇతర వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అందులో భాగంగానే మొబైల్ కవర్ శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్‌ను యూజ్ చేయొచ్చు. పసుపు రంగులోకి మారిన మొబైల్ కేస్‌పై టూత్‌పేస్ట్ రాసి అలాగే వదిలేయాలి. అలా 10-15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు అది మిలమిల మెరిసిపోతుంది.
వైట్ వెనిగర్
సిలికాన్‌ను శుభ్రం చేయడంలో వైట్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం గోరువెచ్చని నీటిలో కొద్ది మొత్తంలో తెల్ల వెనిగర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో కవర్‌ని అరగంట వరకు ఉంచాలి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి నీటితో శుభ్రం చేయాలి. దీంతో కవర్ కొత్తదిలా కనిపిస్తుంది.