/rtv/media/media_files/2025/03/06/xKVflHJUvNxDXZurWhMQ.jpg)
Smart TVs up to 65 inches available in Flipkart Big Saving Days Sale
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌టీవీలను భారీ డిస్కౌంట్‌లతో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా మరిన్ని స్పెషల్ ఆఫర్లు పొందొచ్చు. ఇందులో కోడాక్ టీవీ కస్టమర్లు భారీగా పొదుపు చేసుకునే అవకాశం పొందవచ్చు. శక్తివంతమైన ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో కూడిన కోడాక్ టీవీలు కేవలం రూ.5,999ల నుండి ప్రారంభమవుతాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం నేటి నుంచే ఈ సేల్ ప్రారంభమవుతుంది.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
Kodak TV
గూగుల్ టీవీ ఆధారంగా కోడాక్ కొత్త క్యూఎల్‌ఈడీ టీవీ వివిధ మోడల్‌లో లభిస్తుంది. ఇది 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు కలిగిన టీవీలు రూ. 20,999 ధర నుండి ప్రారంభమవుతాయి. ఈ మోడళ్లలో టీవీలు DTS TRUSURROUND సౌండ్, 1.1 బిలియన్ కలర్‌లతో QLED 4K డిస్ప్లే, డాల్బీ అట్మాస్, HDR10, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
Kodak 9XPRO Series
కోడాక్ 9XPRO సిరీస్‌లో 32-అంగుళాల టీవీ ఫుల్ HD ఆప్షన్‌తో ఉంటుంది. దీని ధర రూ.9,999. ఈ టీవీల్లో రియల్‌టెక్ ప్రాసెసర్, డాల్బీ డిజిటల్ ప్లస్, బిల్ట్‌ఇన్ నెట్‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Kodak SE Series
కోడాక్ SE సిరీస్ A35*4 ప్రాసెసర్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది 20W (24-అంగుళాలు), 30W (32-అంగుళాలు, 43-అంగుళాలు) సరౌండ్ సౌండ్ అవుట్‌పుట్‌తో లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో మిరాకాస్ట్, వై-ఫై, HDMI, USB వంటివి ఉన్నాయి. ఈ టీవీలు 512MB RAM, 4GB ROM తో పాటు YouTube, Prime Video, Sony Liv, Zee5తో పాటు మరిన్ని ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్‌లతో వస్తాయి.
అలాగే 32-అంగుళాలు, 43-అంగుళాల మోడళ్లు బెజెల్-లెస్‌గా ఉంటాయి. అదే సమయంలో 24-అంగుళాల వేరియంట్ స్లిమ్ బెజెల్స్‌ను కలిగి ఉంటాయి. ఈ సిరీస్‌లోని 32 అంగుళాల టీవీ రూ.7,999కి లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
ఇక కోడాక్ టీవీ 24SE5002 మోడల్ ధర రూ. 5,999, 329X5051 మోడల్ ధర రూ. 9,999, 32HDX7XPRO మోడల్ ధర రూ. 9,799, 32SE5001BL మోడల్ ధర రూ. 7,999, 409X5061 మోడల్ ధర రూ. 14999, 429X5071 మోడల్ ధర రూ. 15,499, 439X5081 మోడల్ ధర రూ. 16,999, 43MT5055 మోడల్ ధర రూ. 20,999, 43SE5004BL మోడల్ ధర రూ. 14,499, 50CAPROGT5012 మోడల్ ధర రూ. 24,999, 50MT5011 మోడల్ ధర రూ. 26,499, 55MT5022 మోడల్ ధర రూ.30,499, 65MT5033 మోడల్ ధర రూ.42,999గా ఉన్నాయి.