/rtv/media/media_files/2025/02/11/oVf0YmnndYyYqMVuhNXs.jpg)
rs 200 note
ఇటీవల మార్కెట్లో రూ.200, రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ (RBI) రూ.200 నోట్ల (Rs.200 Notes) ను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది. రూ.200 నోట్లను బ్యాన్ చేయబోతున్నట్లుగా వస్తోన్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. ప్రస్తుతానికి రూ. 200 నోట్లను రద్దు చేసే ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.
Also Read : ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్
Also Read : నీళ్ళు, ఇళ్ళు లేక చాలా మంది ఉంటే..మీకు సైకిల్ ట్రాక్ కావాలా..సుప్రీంకోర్టు ఆగ్రహం
అయితే మార్కెట్లో నకిలీ నోట్లు (Duplicate Notes) పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.ద్ది రోజుల కిందట తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. మీ దగ్గర ఉన్న రూ. 200 నోటు నకిలీదో కాదో తెలుసుకోవడానికి ఈ లక్షణాలు గమనించండి. రూ.200 నోటు ఎడమవైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంటుంది. మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. 'RBI', 'Bharat', 'India', '200' అని సూక్ష్మ అక్షరాలలో రాసి ఉంటుంది. కుడివైపు అశోక స్థూపం గుర్తు ఉంటుంది. ముందుగా గ్రీన్ కలర్‌లో ఉండి.. నోటును అటుఇటు తిప్పుతూ ఉంటే బ్లూ కలర్‌లోకి మారుతుంటుంది. ఒకసారి మీ దగ్గరున్న నోటులో చెక్ చేసుకోండి.
Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే ఇంత పెరిగిందా?
రూ.2 వేల నోటు బ్యాన్
ఇప్పటికే రూ.2 వేల నోటును రిజర్వ్ బ్యాంక్ బ్యాన్ చేసింది. 98 శాతంకుపైగా నోట్లు బ్యాంకులకు చేరగా, మిగిలితా నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి. అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.500,రూ.200 నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ.
Also Read: Telangana Beers : టైమ్ చూసి పెంచారు కదరా.. ! పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత?