Realme P1 5G: పిచ్చెక్కించే ఆఫర్.. 5జీ స్మార్ట్‌ఫోన్ మరీ ఇంత తక్కువా?

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రియల్‌మి పి1 5జీ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ రూ.14,999 ఉండగా రూ.2వేల బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో కూడా రూ.2వేల బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది.

New Update
Realme P1 5G

తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని చూస్తున్నారా? అయితే అలాంటి ఫోన్ ఎక్కడ దొరుకుతుందో తెలీక సతమతమవుతున్నారా? మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు Flipkart, Amazonలో భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ధరల తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. అయితే మరి ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్కడ కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి: చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు!

Realme P1 5G Price and Offers

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో Realme P1 5G ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Realme P1 5Gలోని 6GB RAM/128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కి లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. SBI కార్డ్‌పై రూ. 2000 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్ రూ. 12,999కి లభిస్తుంది.

ఇది కూడా చదవండి: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు..

అలాగే 8GB RAM/128GB వేరియంట్ రూ. 15,999 ఉండగా.. ఈ తగ్గింపుతో రూ. 13,999కి కొనుక్కోవచ్చు. అలాగే అమెజాన్‌లో అయితే ICICI కార్డ్‌ని ఉపయోగించి Realme P1 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదే తగ్గింపు వర్తిస్తుంది. అమెజాన్‌లో యాక్సిస్ బ్యాంక్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. 

Realme P1 5G Specifications

Realme P1 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 2,400 x 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది. 6.67-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అందించబడింది.

ఇది కూడా చదవండి: కాటేసిన కాళేశ్వరం.. కేసీఆర్‌కు బిగ్ షాక్!

ప్యానెల్ రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని కారణంగా తడి చేతులతో లేదా వర్షంలో కూడా ఫోన్‌ను ఉపయోగించవచ్చు. ఇది Android 14 ఆధారిత Realme UI 5.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అంతేకాకుండా ఫోన్ సేఫ్టీ కోసం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అందించారు.

ఇది కూడా చదవండి: యమునా నదిలో నురుగు... స్నానం చేస్తే అంతే సంగతులా?

ఇక కెమెరా విషయానికొస్తే.. Realme P1 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు