100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. By Seetha Ram 05 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మి కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశీయ మార్కెట్ లో ఇతర బ్రాండ్ లకు గట్టి పోటీనిస్తూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మేలో Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇందులో Snapdragon 8s Gen 3 SoC, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు దీనికి అప్డేట్ వెర్షన్ ని భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. Realme GT Neo 7 త్వరలో Realme GT Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అయింది. తాజాగా ఈ ఫోన్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ వివరాలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ ఫోన్ లో ప్రాసెసర్ కింద Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ అందించే అవకాశం ఉందని చెప్పబడింది. అలాగే ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని ఓ టిప్ స్టర్ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండిః బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు అంతేకాకుండా ఈ ఫోన్ కి సంబంధించిన టైమ్ లైన్ సైతం అతడు వెల్లడించాడు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్మార్ట్ ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పబడింది. అలాగే బ్యాటరీ, ఛార్జింగ్ వంటి సమాచారం వెల్లడించాడు. Realme GT Neo 7 దాని ముందు మోడల్ కంటే మరింత పెద్ద బ్యాటరీని పొందే అవకాశం ఉందని చెప్పాడు. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాడు. Realme GT Neo 6 Specifications Realme GT Neo 6 స్మార్ట్ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 SoC చిప్‌సెట్‌తో వచ్చింది. ఇందులో గరిష్టంగా 16 GB RAM, 1TB స్టోరేజీ ఆప్షన్ అందించబడింది. కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ CNY 2,099 (సుమారు రూ. 22,000) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. #tech-news-telugu #realme-mobile #new-mobile మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి