16GB + 1TB స్టోరేజ్‌తో Realme కొత్త ఫోన్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

టెక్ బ్రాండ్ రియల్‌మి తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో ఫోన్‌ని రిలీజ్ చేసింది. రియల్‌మి జిటి 7 ప్రో ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గరిష్టంగా 16GB + 1TB స్టోరేజ్‌ వేరియంట్‌ను అందించారు. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

New Update
realme GT 7 Pro

ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మి అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. తాజాగా తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ realme GT 7 Proని చైనాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.78-అంగుళాల 1.5K డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది OLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని గరిష్ట ప్రకాశం 6000 నిట్‌ల వరకు ఉంటుంది. అదే సమయంలో ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చింది. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి. కాగా ఈ ఫోన్ భారత మార్కెట్‌లో నవంబర్ 26న లాంచ్ కానుంది.

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

realme GT 7 Pro Price

12GB + 256GB వేరియంట్ ధర 3699 యువాన్ అంటే దాదాపు రూ.43 వేలుగా నిర్ణయించబడింది.

16GB + 256GB వేరియంట్ ధర 3899 యువాన్లు అంటే దాదాపు రూ.46 వేలు.

12GB + 512GB వేరియంట్ ధర 3999 యువాన్ అంటే దాదాపు రూ.47 వేలు.

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

16GB + 512GB వేరియంట్ ధర 4299 యువాన్లు, దాదాపు రూ.50 వేలు.

16GB + 1TB వేరియంట్ ధర 4799 యువాన్లు అంటే దాదాపు రూ.56 వేలుగా నిర్ణయించబడింది.

realme GT 7 Pro మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో మార్స్ ఆరెంజ్, స్టార్ ట్రైల్ టైటానియం, వైట్ కలర్‌లు ఉన్నాయి.  

realme GT 7 Pro Specifications

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల OLED ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6000 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వచ్చింది. realme GT 7 Pro ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. అలాగే realme GT 7 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 15పై నడుస్తుంది. ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇది 50MP ప్రధాన వెనుక కెమెరాను కలిగి ఉంది.

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

సోనీ IMX906 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. అదే సమయంలో 3X ఆప్టికల్ జూమ్, 120X హైబ్రిడ్ జూమ్‌తో 50 MP టెలిఫోటో కెమెరా ఉంది. మూడవ కెమెరాగా 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 120 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతుతో 6500 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అద్బుతమైన, అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు