RBI సరికొత్త ప్లాన్..  రూ. 10 వేలు దాటితే గంట ఆగాల్సిందే!

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు.

New Update
RBI

ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 వేల రూపాయల కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదు. కనీసం ఒక గంట పాటు ఆ డబ్బు హోల్డ్‌లో ఉంటుంది. ఈ లోపు మీకు ఏదైనా అనుమానం వచ్చినా లేదా పొరపాటున పంపామని అనిపించినా ఆ ట్రాన్సాక్షన్‌ను వెంటనే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 

సైబర్ నేరగాళ్లు మనల్ని బురిడీ కొట్టించి డబ్బులు లాగేసుకున్నప్పుడు, అవి వారి ఖాతాలో పడకముందే ఆపుకోవడానికి ఈ గంట విరామం బాగా పనికొస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పెద్ద పెద్ద మోసాలన్నీ 10 వేల పైబడిన లావాదేవీల్లోనే ఉంటున్నాయని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

50 వేల కంటే ఎక్కువ డబ్బు

ముసలివారు, దివ్యాంగులు సైబర్ మాయగాళ్ల చేతిలో త్వరగా చిక్కుతారని భావించిన ఆర్బీఐ, వారి కోసం నమ్మకస్తుడైన వ్యక్త అనే ఇంకో రక్షణను తెస్తోంది. దీని ప్రకారం.. వృద్ధులు 50 వేల కంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా పంపాలంటే, వారు ముందుగా చెప్పుకున్న ఒక నమ్మకమైన వ్యక్తి కూడా దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. అలాగే, మీ అకౌంట్‌లో ఏదైనా తేడా జరుగుతోందని అనిపిస్తే, ఒక్క సెకనులో మీ డిజిటల్ సేవలన్నీ ఆపేసే "కిల్ స్విచ్" అనే బటన్‌ను కూడా బ్యాంకులు అందుబాటులోకి తేవాలి. దీన్ని ఒక్కసారి నొక్కితే చాలు, మీ అకౌంట్ నుంచి రూపాయి కూడా కదలదు.

అయితే కంగారు పడకండి.. మీరు షాపుల్లో సామాన్లు కొన్నప్పుడు లేదా నెలనెలా కట్టే కరెంటు బిల్లులు, ఇన్సూరెన్స్ వంటి వాటికి ఈ గంట నిరీక్షణ ఉండదు. మీరు ఎప్పుడూ పంపే నమ్మకస్తుల పేర్లను ముందే లిస్టులో పెట్టుకుంటే వారికి కూడా వెంటనే డబ్బులు వెళ్తాయి. అలాగే, అకౌంట్లలోకి వచ్చే డబ్బుపై కూడా నిఘా పెడుతున్నారు. ఏడాదికి 25 లక్షల కంటే ఎక్కువ డబ్బు అకౌంట్‌లోకి వస్తే, బ్యాంకులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీశాకే ఖాతాలోకి మళ్లిస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై మే 8 వరకు ప్రజల సలహాలు తీసుకుని, ఆ తర్వాతే వీటిని అమలు చేస్తారు.

Advertisment
తాజా కథనాలు