/rtv/media/media_files/2025/01/09/wzJZqMJ0DZRIXqloskdd.jpg)
Oppo Reno 13 and Reno 13 Pro
టెక్ బ్రాండ్ ఒప్పో తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకొచ్చింది. తన ఫ్లాగ్షిప్ Reno 13 seriesను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇందులో Reno 13 and Reno 13 Pro మోడళ్లు ఉన్నాయి. ఈ కొత్త స్మార్ట్ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్, 5,800mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Oppo Reno 13 Price
ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు RAM, స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999గా కంపెనీ నిర్ణయించింది.
Reno 13 Pro Price
Oppo Reno 13 Pro కూడా రెండు వేరియంట్లలో వస్తుంది. ఇది అధిక RAM, స్టోరేజ్‌ను అందిస్తుంది. అందులో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999గా ఉంది. అలాగే 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,999గా నిర్ణయించబడింది.
ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
Oppo Reno 13 Series Sale
Oppo Reno 13, Reno 13 Pro స్మార్ట్ఫోన్లు జనవరి 11 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. Oppo ఫోన్లో కొన్ని లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది.
Oppo Reno 13 Series Specifications
Oppo Reno 13, Reno 13 Proలు చాలావరకు ఒకేలాంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్సెట్, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 సపోర్ట్, 120Hz 1.5K డిస్ప్లే, 1200నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్, రెండు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS15లో రన్ అవుతాయి.
ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
Oppo Reno 13 Series camera
అయితే కెమెరా విషయంలో మాత్రం కాస్త వేరు వేరుగా ఉన్నాయి. రెనో 13 ప్రో వెనుక కెమెరాలలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో ఒప్పో రెనో 13 ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!
అలాగే రెనో 13 ప్రో 6.83-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇక రెనో 13 చిన్న 6.59 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్లు బ్యాటరీల పరంగా కూడా విభిన్నంగా ఉంటాయి. రెనో 13 ఫోన్ 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే రెనో 13 ప్రో ఫోన్ 5,800mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.