వన్‌ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్ OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. చైనాలో అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్‌లో OnePlus 13ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. By Seetha Ram 21 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని తాజాగా వెల్లడించింది. ఈ ఫోన్‌ను కంపెనీ చైనాలో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్‌లో OnePlus 13ను లాంచ్ చేస్తుంది. OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. OnePlus 13 ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ కాగా OnePlus 13 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అందులో వైట్ డాన్ వెర్షన్ సిల్క్ గ్లాస్ టెక్నాలజీని పొందుతుంది. అలాగే బ్లూ మూమెంట్ అనేది బేబీ స్కిన్ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే అబ్సిడియన్ సీక్రెట్ ఎబోనీ వుడ్ గ్రెయిన్ గ్లాస్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇక డిజైన్ పరంగా చూసుకుంటే.. OnePlus 13 మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఫోన్ వెనుక భాగంలో రౌండ్ షేప్ కెమెరా మాడ్యూల్ పొందుతుంది. ఇది కూడా చూడండి: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే? అంతేకాకుండా కెమెరా లైటింగ్ మూడు లెన్స్‌లను కలిగి ఉంటుంది. ఇది LED ఫ్లాష్ యూనిట్‌తో వస్తుంది. దాని కింద OnePlus లోగో క్లీన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కాగా OnePlus దాని డిజైన్‌ను చూపించడానికి కొన్ని టీజర్‌లను రిలీజ్ చేసింది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు OnePlus 13 Specifications OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల BOE డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అందుబాటులో ఉంటుందని చెప్పబడింది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే.. ఫోన్‌లో 24GB LPDDR5x RAM - 1TB UFS 4.0 ఇంబిల్ట్ స్టోరేజ్‌ను కంపెనీ అందించింది. ఇది కూడా చూడండి:Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ LYT-808 ప్రైమరీ సెన్సార్‌తో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా అందించారు. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15లో పని చేస్తుంది. #tech-news-telugu #new-mobile #oneplus-13 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి