/rtv/media/media_files/9HWrdshX4fb5yvfUWmh2.jpg)
Ola Offer : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా చాలా మంది వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దూరం ప్రయాణించే సదుపాయం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో డబ్బును ఆదా చేసుకునేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా దేశంలో అమ్ముడవుతున్నాయి. అందులో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా సత్తా చాటుతోంది. భారతదేశంలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కంపెనీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించగలిగే స్కూటర్లను రిలీజ్ చేస్తూ అబ్బురపరచింది. ఇప్పటికే ఈ కంపెనీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. దీని తర్వాత బజాజ్ ఆటో, టీవీఎస్ ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీకి చెందిన స్కూటర్లు అధికంగా సేల్ అవుతున్నాయి.
ఇకపోతే ఓలా కంపెనీ తన స్కూటర్ల సేల్ పెంచుకునేందుకు తరచూ ఏదో ఒక ఆఫర్‌ను ప్రకటిస్తూ ఉంటుంది. అలాంటిదే తాజాగా తన ఫేమస్ S1 లైనప్‌లోని స్కూటర్లపై భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడంతా పండుగ సీజన్ మొదలైపోయింది కాబట్టి ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు తన స్కూటర్లపై తగ్గింపు ప్రకటించింది. ‘బిగ్గెస్ట్ సీజన్ సేల్-BOSS’ ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చని ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
Ola Electric Scooter Offer
ఇందులో భాగంగానే కంపెనీ తన Ola S1X- 2kWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ను అందుబాటులో ఉంచింది. దీనిని కేవలం రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది. అయితే ఒక్క ఈ మోడల్‌పై మాత్రమే కాకుండా తన ఎస్1 సిరీస్ స్కూటర్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. అంతేకాకుండా రూ.21,000 వరకు అనేక రకాలైన ఆర్థిక బెనిఫిట్స్ పొందవచ్చని చెప్పింది.
ఇందులో రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.7,000 విలువైన 8 ఏళ్ళ వరకు బ్యాటరీ వారంటీలు వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అక్టోబర్ 3 అంటే ఇవాళ్టి నుంచి ఈ ప్రయోజనాలు పొందవచ్చు. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. స్టా్క్ ఉన్నంత వరకు మాత్రమే ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు సమీపంలోని షోరూంను సంప్రదించాలి. కాగా ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌పై 95 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 85 కి.మీ వేగంతో పరుగులు పెడుతుంది.
BOSS just called, and you don't want to miss it. 😉
— Ola Electric (@OlaElectric) October 2, 2024
Biggest Ola Season Sale. Early access for the Ola Community. Valid only for today.
Get the Ola S1 for as low as ₹49,999. #BOSS pic.twitter.com/QfkjkL0HWe
Also Read : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!