Tirupati: టీటీడీ ప్రక్షాళన.. ఇకపై హిందువులకే ఉద్యోగాలు! తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దేవాలయాల్లో వాడే వస్తువులన్నీ పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్ళే ఉండేలా చట్టం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Sep 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupati: లడ్డూ వివాదం వేళ తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తో్ంది. సోమవారం టీటీడీలో ఉదయం 6 నుంచి శాంతిహోమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని దేవాలయాల్లో వాడే వస్తువులు పరిశీలించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయం.. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నేతలు.. తిరుమలలో జరితే అన్ని పనులు వెంకటేశ్వర స్వామికి తెలుసని, ఆయన్ని ఎవరు మలీనం చేయలేరన్నారు. వెంకటేశ్వర స్వామి ఆయన్ని అయన కాపడుకోగలడు. టీటీడీనీ పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3 రోజులు యాగం చేశారు. టీటీడీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. ఆగమ సలహా మీటింగ్ లో IG స్థాయి అధికారితో ఒక సిట్ నియామించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే లడ్డూ వ్యవహారంపై పూర్తి నివేదిక రాగానే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ మత ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్ళే ఉండాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. అవసరం అయితే దీనిపై చట్టం చేస్తామని, అన్ని దేవాలయాల్లో కూడా మహిళలకు గౌరవం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనో భావాలు దెబ్బతిన్న వారికి సూచన చేస్తున్నాం. టీటీడీనీ వ్యాపార కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా మార్చారు. భవిష్యత్ లో ఇలాంటివి జరకుండా చూస్తాం. గతంలో పింక్ డైమండ్ పై ఆరోపణలు చేశారు. దానిపై కేసు వేస్తే దానిని విత్ డ్రా చేసుకున్నారని ఈ సదర్భంగా కూటమి నేతలు గుర్తు చేశారు. #tirupathi #laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి