/rtv/media/media_files/2025/03/22/Mtnd28cxFNEXBOZ1rvUw.jpg)
Mobile Network
ప్రస్తుతం రోజుల్లో 5జీ నడుస్తోంది. కాబట్టి పెద్దగా మొబైల్ ఇంటర్నెట్ సమస్య రాదు. కానీ రూరల్ ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ సమస్య ఉంటోంది. అది అన్ని ఏరియాల్లో కాదు.. కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఫోన్‌లోని ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా చాలా పనులు ఆగిపోతాయి.
ఇది కూడా చూడండి: UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు
ముఖ్యంగా ఆఫీస్ వర్క్ సమయంలో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అయితే సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీనివల్ల కాస్త నిమిషం నెట్ సరిగ్గా రాకపోయినా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఫోన్‌లో సరిగ్గా ఇంటర్నెట్ రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్ కు ఎంత శాతం విధించారంటే..!
ఈ టిప్స్ పాటిస్తే..
మొబైల్ ఇంటర్నెట్ సరిగ్గా రాకపోతే వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ సమస్య వెంటనే క్లియర్ అవుతుంది. ఇలా రీస్టార్ట్ చేసినా కూడా కొన్నిసార్లు ఇంటర్నెట్ సరిగ్గా రాదు. అయినా కూడా ఇంటర్నెట్ రాకపోతే మాత్రం మొబైల్ డేటాను ఆన్ ఆఫ్ చేయాలి. లేదా వైఫే ఆఫ్, ఆన్ చేయండి. అలాగే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి. దీనివల్ల మీ మొబైల్ ఇంటర్నెట్ బాగా వస్తుంది. మీకు నెట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం