/rtv/media/media_files/2025/03/17/onSg95pXE0s5Pi2K3rlk.jpg)
క్రికెట్ అభిమానులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్- 2025 ప్రారంభం కానున్న వేళ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లలో ఎంపిక చేసిన వాటిని రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు ఉచితంగా జియో-హాట్‌స్టార్ మొబైల్/టీవీ4K సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని వెల్లడించింది.
Jio Announces Unlimited Offer
— Reliance Industries Limited (@RIL_Updates) March 17, 2025
For The Upcoming Cricket Season
- Exclusive offer for existing & new Jio SIM users
- 90-day FREE JioHotstar on TV / Mobile in 4K
- 50-day FREE JioFiber / AirFiber trial connection for home
In a game-changing move for cricket lovers, Jio has… pic.twitter.com/bM9WxEZLlw
మార్చి 17 నుంచి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. రీఛార్జ్ చేసుకునే సమయంలో ప్యాక్ వివరాలను ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో పాటు 50 రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా అందుకోవచ్చని జియో తెలిపింది. ఇందులో అపరిమిత వైఫై, 800ప్లస్ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్స్‌ను చూడవచ్చు అని చెప్పింది.
Also read : పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన!
Also read : బీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. 42 శాతం రిజర్వేషన్ ఖరారు!
జియోహాట్‌స్టార్ విలీనం బిగ్ షాక్
అయితే ఇప్పటివరకు ఉచితంంగా అభిమానులకు మాత్రం జియోహాట్‌స్టార్ విలీనం బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మ్యాచ్ లు ఫ్రీగా చూడరాదు. మ్యాచ్‌ల కోసం కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను వెల్లడించింది.
ఇందులో రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ రీఛార్జితో 5జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే అని ఎటువంటి కాల్స్, SMS సదుపాయం ఇందులో ఉండదు. ఇక, రూ.949 ప్లాన్ పైనా ఇలాంటి ఆఫర్ అందిస్తుండగా తాజాగా మరిన్ని ప్లాన్లకు ఈ కాంప్లిమెంటరీ సేవలను జియో విస్తరించింది.
Also read : మామకు రంగులు పూసిన కోడలు... మందలించిన అత్త.. అంతలోనే ఘోరం!
Also Read : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన పసిడి ధరలు