Earthquake: భూకంపం రాకను ముందే పసిగట్టొచ్చు.. జపాన్ శాస్త్రవేత్తల మరో ముందడుగు!

జపానీస్ భూకంపం రాకముందే గుర్తించే టెక్నాలజీపై పని చేస్తున్నారు. ఎక్కడ, ఎంత తీవ్రతతో ఎర్త్‌కేక్ వస్తోందో ముందే అంచనా వేసి గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. భూకంపాలకు సూర్యుని వేడి కూడా కారణమని జపనీస్ రీసెర్చ్‌లో తేలింది.

New Update
detect earthquake_

detect earthquake_ Photograph: (detect earthquake_)

తలుచుకుంటే మానవునికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) తో లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా చేయగలుగుతున్నాము. చంద్రుడిపైకి మానవుడిని పంపించాము. అవయవాలు సైతం మార్పిడి చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ సూర్యుడినే తయారు చేశాం, గాలిలో ఎగిరే విమానాలు సృష్టించాం.. ఇలా ఎంతో అద్భుతాలు మనిషి చేయగలిగాడు. కానీ, భూకంపం ఎప్పుడు వస్తోందో తెలుసుకోలేక పోతున్నాము. ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూలన భూమి కంపిస్తోంది. ప్రతి సంవత్సరం భూకంపాలు సంభవించడం వల్ల వందల మంది చనిపోతున్నారు. లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లుతుంది. భూకంపం రాక ముందుగా కనిపెట్టి నష్టాన్ని నివారించలేకపోతున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా అది ఎందుకు సాధ్యం కావట్లేదు. ఎర్త్‌కేక్‌ను ముందే కనిపెట్టే టెక్నాలజీపై సైంటిస్టులు ఎప్పటి నుంచే ప్రయోగాలు చేస్తున్నారు.

Also read: Womens Day 2025: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

జపాన్‌ (Japan) లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సుకుబా విశ్వవిద్యాలయం పరిశోధకులు చేశాయి. 2022లో జరిగిన ఓ అధ్యయనంలో సూర్యుడి వేడి భూమి కంపించడానికి ఓ కారణమని గుర్తించారు. ఈ పరిశోధనలో భూమిపై సూర్యుని ప్రభావం ఉంటుందని నిరూపించబడింది. ఇలాంటి రీసెర్చ్‌లు రాబోయే రోజుల్లో ఎర్త్‌కేక్‌ను ముందే పసిగట్టొచ్చని ఆశలు పెంచుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భూకంపం రాకను ముందుగానే కనిపెట్టవచ్చు. ఏ ప్రాంతంలో ఎర్త్‌కేక్ వస్తుందో, ఎంత తీవ్రతతో వస్తుందో కచ్చితంగా కనిపెట్టగలిగితే భూకంపం ద్వారా జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలం. జంతువుల్లో ఎలుకలు, పాములు భూకంపాన్ని ముందుగా గుర్తిస్తాయి. 

Also Read :  పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంత పెరిగాయంటే!

భూకంపాన్ని ముందుగానే పసిగట్టే జంతువులు

జంతువుల్లో ఎలుకలు, పాములు భూకంపాన్ని (Earthquake) ముందుగా గుర్తిస్తాయని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు. పెరూలోని యనచాగ జాతీయ పార్క్‌లో ఏర్పాటుచేసిన కెమెరాలను పరిశీలించడం ద్వారా ఆయన ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని కాంటమానాలో 2011లో రెక్టర్ స్కేల్‌పై 7 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ టైంలో రికార్డ్ అయిన పార్క్‌లోని సీసీటీవీ వీడియోస్ దృశ్యాలను డాక్టర్ రాచెల్ గ్రాంట్ లోతుగా అధ్యయనం చేశారు.

భూకంపానికి 23 రోజుల ముందు నుంచే జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఆయన గ్రహించారు. 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. సరిగ్గా ఆ భూకంపానికి ఐదు రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే అప్పటికే ఓ ప్రళయం రాబోతుందన్న స్పృహ వాటికి కలిగిందన్నమాట.

భూకంపానికి ముందు భూ పొరల్లో, ముఖ్యంగా రాళ్ల దిగువన ఏర్పడిన కదలికల వల్ల భూ ఉపరితలంపై, భూవాతావరణంలోని గాలిలో అయాన్ల చలనం ఏర్పడుతుంది. 15 రోజుల ముందు నుంచే అయాన్ల చలనం ప్రారంభమవుతుంది. దీనివల్ల జంతువులపై సెరొటోనియం సిండ్రోమ్ ప్రభావం కలుగుతుంది. అంటే రక్త ప్రసారంలో సెరొటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల జంతువుల శరీరంలో అలసట, గుండెలో తెలియని గుబులు, అర్థంకాని మానసికాందోళన కలుగుతాయి. అందువల్ల జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లోనే ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తాయని, వాటి ప్రవర్తనను గమనించడం ద్వారా భూకంపం తీవ్రతను గుర్తించవచ్చని రాచెల్ వివరించారు.

Also Read :  సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..!

సైంటిఫిక్ టెక్నాలజీ విషయానికి వస్తే

సైంటిఫిక్ టెక్నాలజీ విషయానికి వస్తే భూకంపాన్ని అంచనావేసేదాన్ని సీస్మో మీటర్ అంటారు. ఇది భూకంప తరంగాలను విద్యుత్ తరంగాలుగా మర్చి ఎర్త్‌కేక్‌ను గుర్తిస్తోంది. ప్రస్తుతం ఇదే పద్ధతిని ఫాల్లో అవుతున్నాము. డిస్ట్రిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ (DAS) అనేది అకౌస్టిక్ సిగ్నల్స్, వైబ్రేషన్లను గుర్తించడానికి ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను ఉపయోగించే ఒక న్యూ టెక్నాలజీ. కానీ కొన్ని రోజుల ముందే ఎర్త్‌కేక్ అలర్ట్ ఇవ్వడం లేదు. రెండు మూడు రోజుల ముందే భూకంప హెచ్చరికలు జారీ చేసి టెక్నాలజీపై జపాన్ సైంటిస్టులు పని చేస్తున్నారు.

Also read: farmhouse meeting: KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు