/rtv/media/media_files/2025/02/02/vp9QhlTMZl4shj8SxcJc.jpg)
Incom Tax Calculater
నిర్దేశిత గడువులోగా రిటర్నులు (IT Returns) దాఖలు చేయడం ఆలస్యమైతే రిఫండ్ రాదా? కొత్త ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే చర్చ. కొత్త బిల్లులోని ఓ నిబంధన పై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. తాజాగా దీని పై ఐటీ శాఖ స్పష్టతనిచ్చింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు జులై 31లోపు రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు ఉంది.రిఫండ్లను పొందే విషయంలో ఎలాంటి అడ్డంకులూ లేవు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని క్లాజ్ 263 (1)(ఏ)(ఐఎక్స్) ప్రకారం...పన్ను చెల్లింపుదారుడు నిర్దేశిత గడువులోగా రిటర్నులు ఫైల్ చేస్తేనే రిఫండ్ కోరగలడని చెబుతోందని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసినా రిఫండ్ కు అర్హుడని గుర్తు చేస్తున్నారు.
Also Read:Yashasvi Jaiswal: యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు తీవ్ర గాయం? సెలక్టర్లకు మరో తలనొప్పి!
నిబంధనలూ మార్చలేదని...
దీని వల్ల ఏదైనా కారణంతో నిర్ణీత సమయంలో పన్ను చెల్లించడంలో విఫలమయ్యే పన్ను చెల్లింపుదారులకు ఈ నిబంధన కష్టంగా మారుతుందని పేర్కొంటున్నారు. దీని పై పలువురు పన్ను నిపుణులు ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లులో రిఫండ్లకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ మార్చలేదని పేర్కొంది.
ఒకవేళ ఆలస్యంగా రిటర్నులు ఫైల్ చేసినా రిఫండ్ కు అర్హులేనని పేర్కొంది.ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.ఈ బిల్లు ఆమోదం పొందితే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: IND vs PAK: భారత్ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు!