Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే? టెక్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్‌ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి. By Seetha Ram 06 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్‌ఫినిక్స్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. త్వరలో తన లైనప్‌లో ఉన్న మరో మోడల్ Infinix Zero Flip ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా కంపెనీకి చెందిన మొట్టమొదటి క్లామ్‌షెల్- స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ చేయబడింది. ఇది కూడా చదవండి: 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! అయితే ఇప్పుడు ఈ ఫోన్ దేశీయ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 17న ఈ ఫోన్ దేశంలో లాంచ్ అవుతుందని చెప్పబడింది. కాగా Infinix Zero Flip ఫోన్ 3.64 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు 6.9 అంగుళాల లోపలి స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో వస్తుంది. Infinix Zero Flip ఇప్పుడు ఈ Infinix Zero Flip ఫోన్‌కి సంబంధించి అంచనా వేయబడిన కొన్ని స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ గ్లోబల్ వెర్షన్‌లో ఉన్న స్పెసిఫికేషన్ల మాదిరిగానే దేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది గరిష్టంగా 16GB వరకు RAM, 512GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుందని సమాచారం. ఇది కూడా చదవండి: అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు! ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 6.9 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. అలాగే 3.64 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్‌ప్లే కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఓఐఎస్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #tech-news-telugu #infinix #new-mobiles మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి