Infinix Smart 9 HD: కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. దీన్ని కొట్టేదే లేదు.. లాంచ్ ఎప్పుడంటే?

టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ జనవరి 28న తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Infinix Smart 9 HD ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో భారతదేశంలో ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్లు వైరలవుతున్నాయి.

New Update
Infinix Smart 9 HD launch date

Infinix Smart 9 HD launch date revealed

Infinix Smart 9 HD: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రోజుకో కొత్త కంపెనీ తమ ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇలా అతి తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇప్పటికి వివో, రెడ్ మీ, ఒప్పో, మోటోరోలా ఇలా చాలా కంపెనీలు మార్కెట్‌లో పేరు సంపాదించుకున్నాయి. అందులో ఇన్ఫినిక్స్ కూడా ఒకటి. ఇన్ఫినిక్స్ కంపెనీ తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మరొక సర్‌ప్రైజ్ అందించింది. తన లైనప్‌లో ఉన్న మరో ఫోన్‌ను తీసుకురాబోతుంది. 

Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా  థాయిలాండ్‌!

Infinix Smart 9 HD

ఇన్ఫినిక్స్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ Infinix Smart 9 HD లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జనవరి 28న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా నిర్ధారించారు. 

Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

మన్నిక, డిజైన్ పరంగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD మంచి అనుభూతిని ఇస్తుందన ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇది దాని విభాగంలో అత్యంత బలమైన స్మార్ట్‌ఫోన్ అని పేర్కొంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ 9 HD మూడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. అవి మింట్ గ్రీన్, కోరల్ గోల్డ్, మెటాలిక్ బ్లాక్ కలర్‌లలో రానుంది. 

Also Read: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్!

Infinix Smart 9 HD పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించినప్పటికీ.. ఇది 6.6-అంగుళాల HD+ 90Hz డిస్ప్లే, 13MP డ్యూయల్ AI కెమెరా సెటప్, UNISOC T606 ప్రాసెసర్‌ను కలిగి ఉన్న స్మార్ట్ 8 HD కంటే అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కొత్త మోడల్ ఈ స్పెసిఫికేషన్‌లను మెరుగుపరుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. స్మార్ట్ 9 HD గురించి మరిన్ని వివరాలు జనవరి 24న వెల్లడి చేయబడతాయని ఇన్ఫినిక్స్ తెలిపింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు