/rtv/media/media_files/2025/02/13/wiYXEPmQfpR5iOjZYx4y.jpg)
IndiGo Valentine Day Sale is live
వాలెంటైన్స్ వీక్‌లో చివరి రోజు వాలెంటైన్స్ డే రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రేమ జంటలు వాలెంటైన్స్ వీక్‌ను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రేమికుల కోసం పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ప్లానింగ్ సంస్థలు ఎన్నో ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రేమ జంటల కోసం అదిరిపోయే క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
‘ఇండిగో వాలెంటైన్స్ డే సేల్’
ఈ మేరకు ‘ఇండిగో వాలెంటైన్స్ డే’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో సగం ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే ఉంటుంది. ఇది ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ రూట్లలో ప్రయాణానికి విమాన టికెట్ల బుకింగ్స్‌పై దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చని తెలిపింది. అయితే ఇద్దరు ప్రయాణికులకు కలిపి బుకింగ్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని కండీషన్ పెట్టింది.
IndiGo's Valentine's Day Sale is live. Enjoy up to 50% off on flight and hotel bookings for you and your partner.
— IndiGo (@IndiGo6E) February 12, 2025
Additionally, get flat 10% off on pre-booked meals, XL seats starting at ₹599 and save up to 15% on select 6E add-ons. Book now: https://t.co/lOj6y12PoM. #goIndiGo pic.twitter.com/sc6IBUA2kU
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. బుకింగ్ తేదీకి, జర్నీ తేదీకి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని సంస్థ పేర్కొంది. ఇక ఇక్కడ టికెట్ ధరలతో పాటు ప్రయాణికుల ప్రయాణ యాడ్-ఆన్‌లపై కూడా తగ్గింపులు పొందవచ్చు. అలాగే ప్రీ బుక్ చేసుకున్న ఎక్స్‌ట్రా లగేజీపై 15 శాతం డిస్కౌంట్, సీటు సెలెక్షన్‌పై 15 శాతం డిస్కౌంట్, ప్రీ ఆర్డర్ భోజనంపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
ఈ ఆఫర్లను ఇండిగో సంస్థ అఫిషీయల్ సైట్, మొబైల్ యాప్, ఇండిగో 6ఈ skai ఏఐ చాట్‌బాట్, సెలెక్ట్ చేసిన ట్రావెల్ పార్టనర్స్ వేదికగా బుక్ చేసినపుడు పొందొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇండిగో సంస్థ మరో అదిరిపోయే సేల్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది.
మరో కొత్త సేల్
ఫిబ్రవరి 14న మరో ఫ్లాష్ సేల్ ప్రకటించబోతుంది. దీని ద్వారా మొబైల్ యాప్, అధికారిక సైట్ ద్వారా చేసే మొదటి 500 బుకింగ్స్‌పై ఎక్స్ ట్రా 10 శాతం తగ్గింపు అందించనుంది. దీనిని ఫిబ్రవరి 14 రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11:59 గంటల మధ్య మాత్రమే నిర్వహించనున్నట్లు వెల్లడించింది.