ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ తన కంపెనీ వారసుడి పేరు ప్రకటించారు. బెర్క్ షైర్ హత్‌వే కంపెనీకి వారసుడిని వెల్లడించారు. అతని పెద్ద కొడుకు హువర్డ్ బఫెట్ కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నటు చెప్పారు. ప్రస్తుతం బెర్క్ షైర్ కంపెనీ విలువ ట్రిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.86 లక్షల కోట్లు.
Also Read: Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు
హువర్డ్ కంపెనీ బోర్డులో దాదాపు 30 సంవత్సరాలు పని చేశారు. 94 ఏళ్లున్న వారెన్ బఫెట్‌కు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు మగ సంతానం. వారిలో పెద్ద కుమారుడు హువర్డ్ బఫెట్ వారెన్ బఫెట్ తదనంతరం వారసుడిగా ప్రకటించాడు. వారెన్ బఫెట్ 140 బిలియన్ డాలర్లతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తన పిల్లలకంటే ఛారిటి ట్రస్ట్‌కే ఎక్కువ ఆస్తి రాసిచ్చారు.
Also Read: Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య